ఇషాన్ కిషన్ సెంచరీ మిస్.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ స్కోర్

ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ ఎంచుకుంది.

Pic: @IPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య లక్నో స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ ఎంచుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 34, ట్రావిస్ హెడ్ 17, ఇషాన్ కిషన్ 94, హెన్రిచ్ క్లాసెన్ 24, అనికేత్ వర్మ 26, నితీశ్ కుమార్ రెడ్డి 4, అభియవ్ మనోహర్ 12, పాట్ కమిన్స్‌ 13 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.

Also Read: ఆర్సీబీకి కెప్టెన్‌గా రజత్ పటీదార్‌ కాకుండా జితేశ్ శర్మ ఎందుకు వచ్చాడో తెలుసా?

ఆర్సీబీ బౌలర్లలో రొమారియో షెపర్డ్ 2 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, ఎన్గిడి, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్య ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, లుంగి ఎన్గిడి, సుయాష్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ