SRHvsMI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

సొంతగడ్డపై హైదరాబాద్ భీకరమైన పోరుకు ముంబై ఇండియన్స్ తో తలపడేందుకు సమాయత్తమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆడిన 4 మ్యాచ్ లలో 3 మ్యాచ్ లు గెలిచిన హైదరాబాద్.. రెండు మ్యాచ్ లలో మాత్రమే విజయం దక్కించుకున్న ముంబై ఇండియన్స్ ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. 

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో మార్పులేమీ లేకుండా బరిలోకి దిగుతోంది. ముంబై ఇండియన్స్ మాత్రం జట్టులో కీలక మార్పులు చేపట్టింది. యువరాజ్ సింగ్ కు బదులు ఇషాన్ కిషన్, మలింగ స్థానంలో అల్జెరీ జోసెఫ్ లు బరిలోకి దిగనున్నారు.