Sri Lanka Women vs New Zealand Women match washes out
SL vs NZ : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా మంగళవారం శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
ఈ మ్యాచ్‌లో (SL vs NZ) ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో నిలాక్షిక డిసిల్వా(55 నాటౌట్), కెప్టెన్ చమరి ఆటపట్టు (53) హాఫ్ సెంచరీలలో రాణించారు. కివీస్ బౌలర్లలో సోఫీ డివైన్ మూడు వికెట్లు తీశాడు. బ్రీ ఇల్లింగ్ రెండు వికెట్లు పడగొట్టింది.
AFG vs BAN : 7, 3, 7, 6, 0, 2, 4, 5, 9 ఇది ఫోన్ నంబర్ కాదండి బాబు.. బంగ్లా బ్యాటర్ల కష్టార్జితం..
ఇన్నింగ్స్ విరామ సమయంలో భారీ వర్షం కురిసింది. చాలా సేపటి వరకు వర్షం తగ్గలేదు. వర్షం తగ్గిన తరువాత మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు.
భారత్‌కు లాభం ?
ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం ఓ రకంగా భారత్‌కు మేలు చేకూర్చేదే. శ్రీలంక జట్టు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగా మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో రెండు పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే.. నాలుగు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌లో గెలవగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆ జట్టు ఖాతాలో మూడు పాయింట్లు ఉన్నాయి. పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.
దీంతో కివీస్ సెమీస్ రేసు సంక్లిష్టమైంది. ఇది భారత్‌కు మేలు చేకూర్చేది. ఈ టోర్నీలో భారత్ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత్ ఖాతాలో 10 పాయింట్లు చేరతాయి. కివీస్ మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచినా కూడా గరిష్టంగా 9 పాయింట్ల వరకే చేరుకుంటుంది.
BCCI : ఆసీస్‌తో సిరీస్ తరువాత.. రోహిత్, కోహ్లీ వన్డే భవితవ్యంపై స్పందించిన బీసీసీఐ..
ఇక కివీస్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీస్‌లో టీమ్ఇండియా అడుగుపెట్టడం దాదాపుగా ఖాయం. ప్రస్తుతం భారత జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.