India vs Sri Lanka Match
IND vs SL 1st ODI : ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఇండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ క్రిజ్‌లోకి వచ్చారు.
ఈ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లు ఎంట్రీ ఇచ్చారు. టీ20 సిరీస్‌లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యకుమార్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని అందరూ భావించారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం శ్రేయాస్ అయ్యర్‌కే ప్రాధాన్యతనివ్వడంతో సూర్యకు తుదిజట్టులో చోటు దక్కలేదు. అదేవిధంగా ఇషాన్ కిషన్‌కుసైతం తుది జట్టులో చోటు దక్కలేదు.
వెంకటేశ్ ప్రసాద్ ఆగ్రహం..
తుది జట్టులో యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు చోటుదక్కకపోవటంతో టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కీపర్‌గా సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్‌కు అవకాశం కల్పించారు. ఇటీవలే వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్‌కు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు వెంకటేశ్ ప్రసాద్ వరుస ట్వీట్లు చేశారు. ఒకవేళ గిల్‌ను తీసుకోవాలంటే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపొచ్చు. కేఎల్ రాహుల్ బదులు ఇషాన్ కిషన్‌ను తీసుకొని ఓపెనర్‌గా ఆడిస్తే బాగుండేదని వెంకటేశ్ ప్రసాద్ అన్నారు.
https://twitter.com/BCCI/status/1612714207610535938?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1612714207610535938%7Ctwgr%5Eb04411b534e4a172000cdd0f2d6e34a808bd09b2%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fsports%2Fcricket%2Fstory%2Findia-vs-sri-lanka-1st-odi-live-score-updates-ind-vs-sl-cricket-match-tspo-1612476-2023-01-10
టీమిండియా తుది జట్టు ..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, అక్షర పటేల్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక, యుజేంద్ర చాహల్.
శ్రీలంక తుది జట్టు..
పాతుమ్ నిస్సాంక, కుసల్ మొండిస్ (వికెట్ కీపర్), ఆవిష్క ఫెర్నాండో, ధనంజయ్ డి సిల్వా, చరిత్ అస్లంక, ధుసన్ షనక (సీ), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దునిత్ వెలలాగే, కసున్ రజిత, దిల్హన్