IND vs SL 1st ODI : మిషన్ వరల్డ్ కప్-2023 షురూ..! నేడు ఇండియా వర్సెస్ శ్రీలంక తొలి వన్డే.. ఆ ఇద్దరిలో ఛాన్స్ ఎవరికో?

టీ20 సిరీస్‌లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యకుమార్ యాదవ్ నేడు జరిగే వన్డే తుదిజట్టులో చేరుతాడా లేదా అనేది ప్రశ్నగా మారింది. సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్ మధ్య తుదిజట్టులో ఎవరికైనా ఒక్కరికే అవకాశం దక్కుతుంది. ఒకవేళ శ్రేయాస్, సూర్యకుమార్ యాదవ్‌కు ఇద్దరికి తుది జట్టులో చోటుదక్కితే.. హార్ధిక్ పాండ్యా పూర్తిస్థాయి బౌలర్‌గా జట్టుకు సేవలందించాల్సి ఉంటుంది.

IND vs SL 1st ODI : మిషన్ వరల్డ్ కప్-2023 షురూ..! నేడు ఇండియా వర్సెస్ శ్రీలంక తొలి వన్డే.. ఆ ఇద్దరిలో ఛాన్స్ ఎవరికో?

India vs Srilanka ODI Match

IND vs SL 1st ODI : భారత గడ్డపై ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ నెలల్లో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం భారత్ జట్టు సిద్ధమవుతోంది. నేడు శ్రీలంకతో జరిగే వన్డే మ్యాచ్ ద్వారా మిషన్ వరల్డ్ కప్-2023ని అత్యుత్తమంగా ప్రారంభించాలని భావిస్తోంది. వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక జట్టుతో భారత్ మూడు మ్యాచ్ లు ఆడుతుంది. తొలి మ్యాచ్ నేడు గౌహతిలోని అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీ20 సిరీస్ విజయంతో టీమిండియా జోష్‌తో వన్డే మ్యాచ్ లకు సిద్ధమవ్వగా.. వన్డే సిరీస్‌నైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో శ్రీలంక జట్టు సన్నద్ధమవుతుంది.

India vs Srilanka ODI Series: శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్.. కీలక ప్లేయర్ ఔట్..!

రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా శ్రీలంక జట్టుతో తలపడుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లతో భారత జట్టు బలంగా ఉంది. అయితే, ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా మాత్రం గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. తొలి వన్డేలో శుభ్‌మన్ ఆడుతున్నాడని కెప్టెన్ రోహిత్ ఇప్పటికే పేర్కొన్నాడు. దీంతో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ క్రిజ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. మూడో నెంబర్ బ్యాటర్‌గా కోహ్లీ క్రిజ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. తుదిజట్టులో గిల్ ఉంటాడని కెప్టెన్ కన్ఫార్మ్ చేయడంతో బంగ్లాదేశ్ పర్యటనలో వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కడం కష్టమే.

India vs Sri Lanka Match: రేపు గౌహతిలో ఇండియా వర్సెస్ శ్రీలంక తొలి వన్డే.. పరుగుల వరద ఖాయమా? గత రికార్డులు పరిశీలిస్తే..

మరోవైపు టీ20 సిరీస్‌లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యకుమార్ యాదవ్ నేడు జరిగే వన్డేలో తుదిజట్టులో చేరుతాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్ మధ్య తుదిజట్టులో ఎవరికైనా ఒక్కరికే అవకాశం దక్కుతుంది. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం శ్రేయాస్ అయ్యర్‌ను తుదిజట్టులోకి తీసుకొనేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ శ్రేయాస్, సూర్యకుమార్ యాదవ్‌కు ఇద్దరికి తుది జట్టులో చోటుదక్కితే.. హార్ధిక్ పాండ్యా పూర్తిస్థాయి బౌలర్‌గా జట్టుకు సేవలందించాల్సి ఉంటుంది.

 

భారత్ బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ జట్టులోకి రావటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అతనితో పాటు తుదిజట్టులో మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లలో ఇద్దరిని, స్పిన్ విభాగంలో చాహల్, కుల్దీప్, సుందర్, అక్షర్ పటేల్‌‌లలో ఇద్దరిని తుది జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. మొత్తానికి శ్రీలంకతో తొలి వన్డే మ్యాచ్‌తో భారత్ జట్టు మిషన్ వరల్డ్ కప్ -2023 ప్రారంభిస్తుండటంతో తుది జట్టుకోసం పలు విధాలుగా కసరత్తు చేయనుంది.