India vs Sri Lanka Match: రేపు గౌహతిలో ఇండియా వర్సెస్ శ్రీలంక తొలి వన్డే.. పరుగుల వరద ఖాయమా? గత రికార్డులు పరిశీలిస్తే..

భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఇప్పటి వరకు 162 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. వీటిల్లో టీమిండియా 93, శ్రీలంక జట్టు 57 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ఇరు జట్ల మధ్య 163వ వన్డే మ్యాచ్ రేపు గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు  అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

India vs Sri Lanka Match: రేపు గౌహతిలో ఇండియా వర్సెస్ శ్రీలంక తొలి వన్డే.. పరుగుల వరద ఖాయమా? గత రికార్డులు పరిశీలిస్తే..

India vs Sri Lanka Match

India vs Sri Lanka Match: శ్రీలంక జట్టుపై టీ20 సిరీస్ విజయంతో జోరుమీదున్న టీమిండియా జట్టు రేపటి నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లోనూ సత్తాచాటేందుకు సిద్ధమవుతుంది. మూడు వన్డే మ్యాచ్‌ల‌ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మంగళవారం గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరుగుతుంది. మధ్యాహ్నం 1:30 గంటకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. వన్డే మ్యాచ్‌లకు రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగుతుంది. టీ20 సిరీస్‌లో యువకులతో భారత్ జట్టు బరిలోకి దిగగా.. వన్డే మ్యాచ్‌లలో సీనియర్లు, జూనియర్లతో జట్టు సమతూకంగా ఉంది. ఈ వన్డేలో కోహ్లీ, రోహిత్ వంటి కీలక ఆటగాళ్లు ఆడనున్నారు.

India Vs Sri Lanka: 9 సిక్సులు, 7 ఫోర్లతో చెలరేగి సెంచరీ చేసిన సూర్య.. శ్రీలంక లక్ష్యం 229 పరుగులు

భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఇప్పటి వరకు 162 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. వీటిల్లో టీమిండియా 93, శ్రీలంక జట్టు 57 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. 11 మ్యాచ్ లు ఫలితం తేలలేదు. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్ల మధ్య 163వ వన్డే మ్యాచ్ రేపు గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు  అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బర్సపరా స్టేడియంలో కేవలం ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే జరిగింది. రెండు టీ20 మ్యాచ్‌లు జరిగాయి.

Ind Vs SL 3rd T20I : భారత్ దెబ్బ లంక అబ్బ.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం, సిరీస్ కైవసం

2018లో ఈ స్టేడియంలో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య వన్డే మ్యాచ్ జరగ్గా పరుగుల వదరపారింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 322 పరుగులు చేయగా.. టీమిండియా 326 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలో సెంచెరీలు చేశారు. రోహిత్ శర్మ వ్యక్తిగతం 152 పరుగులు చేశాడు.

T20 Match Sri Lanka Win : రెండో టీ20 మ్యాచ్ లో భారత్ పై శ్రీలంక గెలుపు

గౌహతిలోని బర్సపరా స్టేడియంలో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. 2022 అక్టోబర్ నెలలో ఈ స్టేడియంలో ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఇరు జట్లు భారీస్కోర్ సాధించాయి. రెండోసారి బ్యాటింగ్ కు దిగిన జట్టు విజయం సాధించింది. పిచ్ పరిస్థితిని బట్టిచూస్తే.. ఛేజింగ్ చేసే జట్టు విజేతగా నిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకొనే అవకాశం ఉంది. గౌహతిలో సాధారణ వాతావరణ పరిస్థితులే ఉన్నాయి. మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పులేదు.