మనోళ్లు బ్యాటుతో ధనాధనా ఏం బాదారు భయ్యా.. ఐపీఎల్ చరిత్రలో భారీ లక్ష్య చేధనలు ఇవే..

ఈ విజయాలు ఐపీఎల్‌ మ్యాచ్‌లలో మర్చిపోలేని ఘట్టాలుగా నిలిచిపోయాయి.

ఐపీఎల్‌లో బ్యాటర్లు ఏ మ్యాచులో ఎలా ఆడతారో ఊహించడం కష్టం. కొన్ని మ్యాచుల్లో బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోతుంటారు. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచులో పంజాబ్ పై 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్‌హెచ్ 8 వికెట్ల తేడాతో ఇంకా రెండు ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే ఛేదించింది. ఐపీఎల్ లో కొత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో ఛేజింగ్‌లో నెలకొన్న రికార్డులను చూద్దాం..

పంజాబ్ కింగ్స్ (261 పరుగుల ఛేదన)
ఐపీఎల్‌లో 2024 ఏప్రిల్ 26న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టు ఇచ్చిన 261 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.4 ఓవర్లలోనే చేధించింది. పంజాబ్ నుంచి జానీ బెయిర్‌స్టో 48 బంతుల్లో 108 పరుగులు, శశాంక్ సింగ్ 28 బంతుల్లో 68 పరుగులు చేశారు. ఇది ఐపీఎల్ చరిత్రలో భారీ లక్ష్య చేధనగా నమోదైంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (246 పరుగులు)
ఐపీఎల్‌లో 2025 ఏప్రిల్ 12న హైదరాబాద్‌-పంజాబ్ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ (36 బంతుల్లో 82) రాణించడంతో పంజాబ్ 245/6 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి అభిషేక్ శర్మ 55 బంతుల్లో 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులు చేశారు. దీంతో 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్‌హెచ్ ఈజీగా ఛేదించింది.

రాజస్థాన్ రాయల్స్ (226 పరుగులు)
ఐపీఎల్‌లో 2020 సెప్టెంబర్ 27న షార్జాలో పంజాబ్‌-రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. మయాంక్ అగర్వాల్ (106), కేఎల్ రాహుల్ (69) రాణించడంతో పంజాబ్ 223/2 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ నుంచి కెప్టెన్ స్టీవ్ స్మిత్ (27 బంతుల్లో 50), సంజు శాంసన్ (42 బంతుల్లో 85), రాహుల్ తేవాటియా (31 బంతుల్లో 53) చేయడంతో 224 పరుగుల లక్ష్యాన్ని మూడు బంతులు మిగిలి ఉండగానే ఆర్ఆర్ ఛేదించింది.

రాజస్థాన్ రాయల్స్ (224 పరుగులు)
ఐపీఎల్ 2024 సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇచ్చిన 224 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు విజయవంతంగా చేధించింది. ఈ మ్యాచ్ లో జాస్ బట్లర్ 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ముంబై ఇండియన్స్ (219 పరుగులు)
ఐపీఎల్‌లో 2021 మే 1న చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 219 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. కీరన్ పొలార్డ్ అజేయంగా 34 బంతుల్లో 87 పరుగులు చేసి మ్యాచ్ ని గెలిపించాడు.

ఈ విజయాలు ఐపీఎల్‌ మ్యాచ్‌లలో మర్చిపోలేని ఘట్టాలుగా నిలిచిపోయాయి.