Stephen Fleming Advices Team To Follow RCB IPL 2024 Style To Reach Playoffs
‘మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో అన్ని గెలుస్తామనే నమ్మకం ఉంది. ఇలా చెబుతుంటే కొందరు నవ్వుతారని తెలుసు. కానీ ఆర్‌సీబీ గత సీజన్‌లో ఇలా చేసి చూపించింది. కాబట్టి మాకు ఇంకా అవకాశం ఉంది. ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలి. ఒకవేళ అలాజరగకపోతే పేలవ సీజన్ మరో రకంగా సద్వినియోగం చేసుకుంటాం.’ అని ఫ్లెమింగ్ చెప్పాడు.
‘ఇలాంటి పరిస్థితులు గతంలోనూ ఎదురు అయ్యాయి. ఆ తరువాత రెట్టించిన ఉత్సాహంతో ఆ మరుసటి సంవత్సరం విజేతగా నిలిచాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనేదానిపై దృష్టి పెట్టాం. ఎలా ముందుకు సాగాలా మాకు బాగా తెలుసు. ఏ మ్యాచ్‌ను కూడా తేలికగా తీసుకోబోము. ప్రతి మ్యాచ్‌లోనూ 100 శాతం ప్రదర్శన ఇచ్చేందుకు జట్టు ప్రయత్సిస్తుంది.’ అని అని ఫ్లెమింగ్ అన్నాడు.