Steve Smith lambasts Melbourne pitch after england beat australia in 4th test
Steve Smith : యాషెస్ సిరీస్‌లో వరుసగా ఇంగ్లాండ్ పై మూడు టెస్టు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మంచి జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు గట్టి షాక్ తగిలింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. కాగా.. ఈ ఓటమిపై ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ దూరం కాగా.. తాత్కాలిక సారథిగా స్మిత్ వ్యవహరిస్తున్నాడు.
ఇక ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం గమనార్హం. దీంతో పిచ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తొలి రోజు 20 వికెట్లు నేలకూలగా రెండో రోజు 16 వికెట్లు పడ్డాయి. ఈ క్రమంలో పిచ్, ఓటమిపై స్టీవ్ స్మిత్ (Steve Smith) మాట్లాడుతూ.. ఇది కష్టమైన మ్యాచ్ అని అన్నాడు. మ్యాచ్ చాలా త్వరగా ముగిసిందన్నాడు. తాము అదనంగా మరో 50 నుంచి 60 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా ఆఖరి వరకు పోరాడామన్నాడు.
ఇక పిచ్ గురించి మాట్లాడుతూ.. పిచ్ ఊహించిన విధంగానే ఉందన్నాడు. అయితే.. బంతి పాతబడిన తర్వాత తాము అనుకున్నట్లుగా ప్రవర్తించలేదన్నాడు. ప్రత్యర్థి టీమ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఆరంభంలో కొన్ని ఓవర్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారని చెప్పుకొచ్చాడు. దానివల్ల బంతి త్వరగా పాత బడిపోయిందన్నాడు.
ఏదీఏమైనప్పటికి కూడా పిచ్ బౌలర్లకు అతిగా సహకరించిందన్నాడు. రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడడం అందుకు నిదర్శనం అన్నాడు. పచ్చికను కాస్త తొలగించి ఉండే బాగుండేది. అయితే.. పిచ్ ఎలాఉన్నప్పటికి కూడా తాము మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది అని స్మిత్ అన్నాడు.