ఫోన్లో షోయబ్ మాలిక్ మొదటి పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా?

ఆయేషా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నేను కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. దీని గురించి మా తల్లిదండ్రులకు చెప్పలేకపోయాను.

story of shoaib malik first marriage and his talked about telephonic nikah

Shoaib Malik: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను తాజాగా పెళ్లాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో వివాహ బంధానికి ముగింపు పలికినట్టు దీంతో నిర్ధారణ అయింది. అయితే షోయబ్ మాలిక్ కు ఇది మూడో పెళ్లి కాగా, సనా జావేద్‌కు రెండో షాదీ కావడం విశేషం. సానియా మీర్జా కంటే ముందు.. షోయబ్ మాలిక్ మరో హైదరాబాద్ అమ్మాయి ఆయేషా సిద్ధిఖీని పెళ్లి చేసుకున్నాడు. 2002లో ఆయేషా సిద్ధిఖీని ఫోన్‌లో పెళ్లి చేసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా అతడే గతంలో వెల్లడించాడు.

పెళ్లికి ఆయేషా తొందరపెట్టింది..
ఆయేషా సిద్ధిఖీని చూడకుండానే ఫోన్‌లో నిఖా చేసుకున్నట్టు టైమ్స్ న్యూస్ నెట్ వర్క్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షోయబ్ మాలిక్ చెప్పాడు. పెళ్లికి ముందు తామిద్దరం తరచుగా ఫోన్ లో మాట్లాడుకునేవాళ్లమని, ఈ విషయం బయటకు తెలియడంతో హడావుడిగా షాదీ చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. “ఈ ఎపిసోడ్ 2002లో జరిగింది. ఆయేషా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నేను కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అయితే హడావుడిగా పెళ్లి చేసుకోవాలనుకోలేదు. కానీ మా విషయం బయట ప్రపంచానికి తెలియడంతో వెంటనే పెళ్లి చేసుకోవాలని ఆయేషా తొందరపెట్టింది. అయితే నేను ఆయేషా దగ్గరకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో టెలిఫోన్ నిఖా చేసుకోమని ఆమె సూచించింది. దీని గురించి మా తల్లిదండ్రులకు చెప్పలేకపోయాను. ఎందుకంటే వారు నా పెళ్లి ఘనంగా చేయాలనుకున్నారు. అప్పుడు నాకు కేవలం 20 ఏళ్లు.. ఆయేషా వైపునుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో టెలిఫోన్ నిఖా చేసుకోవాల్సి వచ్చింది. 2002, జూన్ లో ఒక రోజు ఉదయం మా ఇంటి నుంచి నా ఫ్రెండ్ దుకాణానికి వెళ్లి అక్కడి నుంచి ఫోన్ చేశాను. తర్వాత నాకు పంపించిన నిఖానామాపై సంతకం పెట్టాన”ని షోయబ్ మాలిక్ ఇంటర్వ్యూలో చెప్పాడు.

 

15 కోట్ల రూపాయల భరణం..
అయితే తనకు ఫొటోలో చూపించిన అమ్మాయి.. తాను ఫోన్‌లో మాట్లాడుతున్న యువతి వేర్వేరు అని 2005 ఆగస్టులో షోయబ్ మాలిక్ గుర్తించాడు. ఇదే విషయమై ఆయేషాను అతడు నిలదీయగా.. ఆమె కూడా నిజం ఒప్పుకుంది. తనతో పాటు ఫొటోలో ఉన్న అమ్మాయి చిత్రాలను బయటపెట్టాలని షాయబ్ అనుకున్నాడు. కానీ ఫొటోలో ఉన్న అమ్మాయికి అప్పటికే వివాహం అయినందున అలా చేయవద్దని ఆయేషా కోరడంతో షోయాబ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కాగా, 2010లో సానియాతో షాయాబ్ వివాహానికి ముందు ఆయేషా సిద్ధిఖీ తెర ముందుకు వచ్చింది. 2002లో షాయాబ్ తో తనకు పెళ్లైన విషయాన్ని ఆమె బయటపెట్టింది. దీన్ని షోయబ్ ఖండించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించింది. అంతేకాదు తమ పెళ్లికి సంబంధించిన వీడియోను సాక్ష్యంగా చూపించింది. ఈ వివాదం నేపథ్యంలో 15 కోట్ల రూపాయలు భరణంగా ఇచ్చి ఆయేషాతో వివాహబంధాన్ని షోయబ్ రద్దు చేసుకున్నాడని వార్తలు వచ్చాయి.

‘ఖులా’తో షోయబ్‌కు సానియా విడాకులు
సానియా మీర్జాతోనూ పొసగకపోవడంతో తాజాగా షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. 2010, ఏప్రిల్ 12న సానియాను హైదరాబాద్ లో పెళ్లాడాడు. తర్వాత వీరిద్దరూ దుబాయ్ లో కాపురం పెట్టారు. వీరికి ఐదేళ్ల ఇజ్‌హ‌న్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే రెండేళ్ల నుంచి సానియా, షోయబ్ మధ్య పొరపొచ్చాలు కావడంతో గతేడాది ‘ఖులా’ ప్రకారం వీరి వైవాహిక బంధం రద్దయింది. ఇస్లాం చట్టం ప్రకారం భార్య ఇచ్చే విడాకులను ‘ఖులా’ అని పిలుస్తారు. దీని ప్రకారం భార్యకు భర్త నుంచి భరణం, ఇతర లాంఛనాలేవి రావు. భర్త విడిపోవాలనుకుంటే తలాక్ చెబుతాడు.

 

ట్రెండింగ్ వార్తలు