Sunil Gavaskar : సర్ఫరాజ్.. ఆ చెత్త షాట్ అవసరమా? సునీల్ గవాస్కర్ కీలక సూచన

సర్ఫరాజ్ ఖాన్ అవసరం లేని షాట్ ఆడి ఔట్ కావడంతో టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్

Sarfaraz Khan

IND vs ENG Test Match : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాలలో చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. రెండోరోజు ఆటలో భారత్ బ్యాటర్లు రాణించారు. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. ఇటీవల టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఐదు ఇన్నింగ్స్ లో మూడు అర్థ సెంచరీలు చేశాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ సర్ఫరాజ్ సద్వినియోగం చేసుకోలేక పోయాడు. ధర్మశాలలో రెండోరోజు ఆటలో సర్ఫరాజ్ 60 బంతుల్లో 56 పరుగులు చేశాడు. తొలుత క్రీజులో కుదురుకునే వరకు నెమ్మదిగా ఆడిన సర్ఫరాజ్ ఆ తరువాత బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సర్ఫరాజ్ సెంచరీ కొడతారని అందరూ భావించారు. కానీ చెత్త షాట్ తో పెవిలియన్ బాట పట్టాడు.

Also Read : Virat Kohli : క్రికెట్‌కు దూరంగాఉన్నా కోట్లు సంపాదిస్తున్న కోహ్లీ..ఎలాగో తెలుసా?

సర్ఫరాజ్ ఖాన్ అవసరం లేని షాట్ ఆడి ఔట్ కావడంతో టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ బ్రేక్ ముందువరకు బౌండరీలతో విరుచుకుపడిన సర్ఫరాజ్.. ట్రీబేక్ తరువాత ఆడిన తొలి బంతినే కట్ షాట్ కొట్టబోయి ఔటయ్యాడు. ఆయన ఔటైన తీరుపై గవాస్కర్ స్పందిస్తూ.. బంతి కట్ షాట్ ఆడేందుకు అనువుగా పడకపోయినా.. దాన్ని షాట్ గా మలిచేందుకు ప్రయత్నించడంతో మూల్యం చెల్లించుకున్నాడు. విరామం తరువాత షాట్లు ఆడేందుకు కాస్త సమయం తీసుకోవాలి. నేను 200 పరుగులు చేసినా.. ఆ తరువాత బంతిని ఎదుర్కొనేటప్పుడు సున్నా దగ్గరే ఉన్నా అనుకుంటా.. అంటూ దిగ్గజ క్రికెటర్ బ్రాడ్ మ్యాన్ మాటలను గుర్తు చేసుకోవాలి అంటూ సర్ఫరాజ్ ఖాన్ కు సునీల్ గవాస్కర్ సూచించారు.

Also Read : Duck on 100th Test : వందో టెస్టులో డ‌కౌట్ అయిన ఆట‌గాళ్లు వీరే.. అశ్విన్‌తో పాటు..

ఇదిలాఉంటే సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్ లో వరుసగా మూడు ఆఫ్ సెంచరీలు చేశాడు. వాటిలో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 66 బంతులకు 62 పరుగులు, మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ 72 బంతులకు 68 పరుగులు, ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 60బాల్స్ కు 56 పరుగులు పూర్తి చేశాడు.

 

ట్రెండింగ్ వార్తలు