Duck on 100th Test : వందో టెస్టులో డ‌కౌట్ అయిన ఆట‌గాళ్లు వీరే.. అశ్విన్‌తో పాటు..

చిర‌స్మ‌ర‌ణీయ‌మైన టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణించిన‌ప్ప‌టికీ బ్యాటింగ్‌లో విఫ‌లం అయ్యాడు టీమ్ఇండియా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌.

Duck on 100th Test : వందో టెస్టులో డ‌కౌట్ అయిన ఆట‌గాళ్లు వీరే.. అశ్విన్‌తో పాటు..

List of players with duck on 100th Test

Duck on 100th Test : చిర‌స్మ‌ర‌ణీయ‌మైన టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణించిన‌ప్ప‌టికీ బ్యాటింగ్‌లో విఫ‌లం అయ్యాడు టీమ్ఇండియా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌. త‌న కెరీర్‌లో ఆడుతున్న వందో టెస్టు మ్యాచ్‌లో డ‌కౌట్ అయ్యాడు. ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో టామ్‌హార్డ్లీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్ర‌మంలో ఓ చెత్త రికార్డును మూట గ‌ట్టుకున్నాడు. వందో టెస్టులో డ‌కౌట్ అయిన ఎనిమిదో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

అశ్విన్ కంటే ముందు ఏడుగురు వారి 100వ టెస్ట్ మ్యాచ్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. టీమ్ ఇండియా ఆట‌గాళ్ల‌లో అశ్విన్ కంటే ముందు దిలీప్ వెంగ్ స‌ర్కార్ మాత్ర‌మే త‌న 100వ టెస్టులో డ‌కౌట్ అయ్యాడు.

100వ టెస్టులో డకౌట్ అయిన ఆటగాళ్లు వీరే..

1.రవిచంద్రన్ అశ్విన్ (భార‌త్‌)
2.దిలీప్ వెంగ్‌సర్కార్ (భార‌త్‌)
3.అలన్ బోర్డర్ (ఆస్ట్రేలియా)
4.కోర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్‌)
5.మార్క్ టేలర్ (ఆస్ట్రేలియా)
6.స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూజిలాండ్‌)
7.అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్)
8.బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్‌)

Sarfaraz Khan : మార్క్‌వుడ్ స్లెడ్జింగ్‌..! అప్ప‌ర్ క‌ట్‌తో స‌ర్ఫ‌రాజ్ స‌మాధానం.. వీడియో వైర‌ల్‌

నాలుగు వికెట్లు..

ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రుగుతున్న త‌న వందో టెస్టులో అశ్విన్ 37 ఏళ్ల అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. మొత్తంగా టెస్టుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 23.83 సగటుతో 511 వికెట్లు ప‌డ‌గొట్టాడు. స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కుంబ్లేను అధిగమించాడు. అదే సమయంలో ప్రస్తుత సిరీస్‌లో స్వదేశంలో టెస్టుల్లో 350 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.