Sarfaraz Khan : మార్క్‌వుడ్ స్లెడ్జింగ్‌..! అప్ప‌ర్ క‌ట్‌తో స‌ర్ఫ‌రాజ్ స‌మాధానం.. వీడియో వైర‌ల్‌

త‌న ఏకాగ్ర‌త‌ను చెడ‌గొట్టేందుకు వుడ్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను స‌ర్ఫ‌రాజ్ ప‌ట్టించుకోలేదు. త‌న బ్యాట్‌తో అద్భుత స‌మాధానం చెప్పాడు.

Sarfaraz Khan : మార్క్‌వుడ్ స్లెడ్జింగ్‌..! అప్ప‌ర్ క‌ట్‌తో స‌ర్ఫ‌రాజ్ స‌మాధానం.. వీడియో వైర‌ల్‌

Sarfaraz Khan owns Mark Wood with an outrageous shot

Sarfaraz khan ramp shot : ధ‌ర్మ‌శాల వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు ఐదో టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. టీమ్ఇండియా బ్యాట‌ర్లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. దీంతో వారిని ఔట్ చేయ‌లేక ఇంగ్లాండ్ బ్యాట‌ర్లు నోటికి ప‌ని చెబుతున్నారు. రెండో రోజు ఆట‌లో ఇంగ్లాండ్ పేస‌ర్ మార్క్‌వుడ్ భార‌త యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్‌ఖాన్ పై నోరు పారేసుకున్నాడు. త‌న ఏకాగ్ర‌త‌ను చెడ‌గొట్టేందుకు వుడ్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను స‌ర్ఫ‌రాజ్ ప‌ట్టించుకోలేదు. త‌న బ్యాట్‌తో అద్భుత స‌మాధానం చెప్పాడు.

భార‌త ఇన్నింగ్స్‌లో 76వ ఓవ‌ర్‌ను వుడ్ వేశాడు. మొద‌టి బంతిని సర్ఫ‌రాజ్ ఖాన్ బౌండ‌రీ బాదాడు. దీంతో వుడ్ స‌హ‌నం కోల్పోయాడు. ఆ త‌రువాతి బంతిని బౌన్స‌ర్ వేశాడు. స‌ర్ఫ‌రాజ్ ప‌రుగులేమీ చేయ‌క‌పోవ‌డంతో అత‌డిపై నోరు పారేసుకున్నాడు. స‌ర్ఫ‌రాజ్ మాత్రం కామ్‌గా ఉన్నాడు. ఆ మ‌రుస‌టి బంతికి మ‌ళ్లీ వుడ్ బౌన్స‌ర్ వేయ‌గా మోకాళ్ల‌పై కూర్చుని అద్భుత‌మైన అప్ప‌ర్ క‌ట్ షాట్‌ను స‌ర్ఫ‌రాజ్ ఆడాడు. బంతి బౌండ‌రీకి వెళ్లింది. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

SunRisers Hyderabad : అక్క‌డ రెండు టైటిల్స్‌ గెలిచిన జెర్సీతో ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్‌.. నెట్టింట సెటైర్లు!

మార్క్‌వుడ్‌కు గ‌ట్టి పంచ్ ఇచ్చాడ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా.. వుడ్ వేసిన మ‌రుస‌టి ఓవ‌ర్‌లోనూ స‌ర్ఫ‌రాజ్ ఫోర్, సిక్స్ బాదాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 60 బంతులు ఎదుర్కొన్న స‌ర్ఫ‌రాజ్ 8 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 56 ప‌రుగులు చేశాడు. టీ విరామం అనంత‌రం తొలి ఓవ‌ర్‌లోనే షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో రూట్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త్ త‌న మొద‌టి ఇన్నింగ్స్ ఆడుతోంది. 100 ఓవ‌ర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 426 ప‌రుగులు చేసింది. ర‌వీంద్ర జ‌డేజా (14), ధ్రువ్ జురెల్ (15) లు క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం భార‌త్ 208 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

శ‌త‌క్కొట్టిన రోహిత్ శ‌ర్మ‌.. సెంచ‌రీ నంబ‌ర్ 48.. జోరూట్ రికార్డ్ బ్రేక్‌..