Pic: @IPL (X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ ముందు కేకేఆర్ 201 పరుగుల టార్గెట్ ఉంచింది.
కోల్‌కతా బ్యాటర్లలో క్వింటన్ 1, సునీల్ నరైన్ 7, అజింక్యా రహానె 38, రఘువంశీ 50, వెంకటేశ్ అయ్యర్ 60, రింకూ సింగ్ 32, రస్సెల్స్ 1 పరుగు చేశారు. దీంతో 20 ఓవర్లలో కోల్‌కతా జట్టు స్కోరు 200-5గా నమోదైంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో షమీ, కమిన్స్, అన్సారీ, హర్షల్ పటేల్, మెండిస్ ఒక్కో వికెట్ల చొప్పున తీశారు.
కోల్‌కతా జట్టు: క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రఘువంశీ, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్, మెండిస్, సిమర్‌జీత్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ