Ambati Rayudu : అవును.. బౌండ‌రీ లైన్ జ‌రిపారు.. సూర్య‌కుమార్ యాద‌వ్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నింగ్ క్యాచ్ పై అంబ‌టి రాయుడు..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఫైన‌ల్ మ్యాచ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ బౌండ‌రీ లైన్ వ‌ద్ద అందుకున్న క్యాచ్ పై అంబ‌టి రాయుడు (Ambati Rayudu)..

Suryakumar T20 WC catch Ambati Rayudu batter claims boundary ropes were pushed back

Ambati Rayudu : రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో గ‌తేడాది భార‌త జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఫైన‌ల్ మ్యాచ‌లో ద‌క్షిణాఫ్రికాను చిత్తు చేసిన భార‌త్‌.. 17 ఏళ్ల త‌రువాత రెండోసారి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. అయితే.. నాటి ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ బౌండ‌రీ లైన్ వ‌ద్ద అందుకున్న‌క్యాచ్ పై అప్ప‌ట్లో తీవ్ర దుమారం రేగింది.

సూర్య క్లీన్ క్యాచ్ అందుకున్నాడ‌ని కొంద‌రు అంటే.. మ‌రికొంద‌రు మాత్రం బౌండ‌రీ రోప్‌ను జ‌రిపార‌ని అన్నారు. తాజాగా నాటి క్యాచ్‌పై టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు అంబ‌టి రాయుడు చేసిన వ్యాఖ్య‌లు మ‌రోసారి సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌ను లేవ‌దీశాయి.

India Asia Cup 2025 : ఆసియాక‌ప్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక నేడే.. శ్రేయ‌స్‌కు నో ఛాన్స్‌! గిల్‌, య‌శ‌స్విల‌లో ఒక‌రికే చోటు?

శుభంకర్ మిశ్రాతో పాడ్ కాస్ట్‌లో అంబ‌టి రాయుడు పాల్గొన్నాడు. ఈ క్ర‌మంలో నాటి సూర్య క్యాచ్‌పై రాయుడు (Ambati Rayudu) స్పందించాడు. నాటి మ్యాచ్‌లో కామెంటేటర్ల సౌకర్యం కోసం బ్రాడ్ కాస్టర్స్ సిబ్బంది బౌండరీ లైన్ జరిపారని చెప్పాడు.

‘నాటి ఫైన‌ల్ మ్యాచ్ విరామ స‌మ‌యంలో కామెంటేట‌ర్ల సౌక‌ర్యం కోసం బౌండ‌రీ రోప్‌ను సిబ్బంది కాస్త వెన‌క్కి జ‌రిపారు. ఓ కుర్చీ, స్ర్కీన్‌ను ఏర్పాటు చేశారు. మ్యాచ్ తిరిగి ప్రారంభం అయ్యే స‌మ‌యంలో కుర్చీ, స్ర్కీన్‌ను తీసివేశారు. మ‌ళ్లీ రోప్‌ను య‌థాస్థానంలో ఉంచ‌డం మ‌రిచిపోయారు.’ అని అన్నాడు.

Asia Cup 2025 : ఆసియాక‌ప్‌లో భార‌త్‌ను చిత్తుగా ఓడిస్తాం.. జ‌ట్టు ప్ర‌క‌ట‌న త‌రువాత పాక్ సెల‌క్ట‌ర్ వ్యాఖ్య‌లు..

‘అదంతా దేవుడి ప్లాన్‌లా అనిపించింది. ఒక‌వేళ అలా బౌండ‌రీ రోప్‌ను జ‌ర‌ప‌క‌పోయి ఉంటే.. ఆ క్యాచ్ ఖ‌చ్చితంగా సిక్స్ అయి ఉండేది. ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా సూర్య ప‌ట్టిన క్యాచ్ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. అది క్లియ‌ర్ క్యాచ్‌. ఆరోజు అదృష్టం భార‌త్ వైపు ఉంది.’ అని రాయుడు తెలిపాడు.