Team India: ఆస్ట్రేలియాతో టి20 సిరీస్.. టీమిండియా కెప్టెన్ రేసులో యంగ్ బ్యాటర్!

వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్ కు టీమిండియాకు ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తారనే దానిపై క్రీడావర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Team India T20 Captain: వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్ కు టీమిండియాకు ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తారనే దానిపై క్రీడావర్గాల్లో ఆసక్తి నెలకొంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయంతో ప్రపంచకప్ మధ్యలోనే వైదొలగాడు. నవంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే టి20 సిరీస్ కు అతడు కోలుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో టి20 జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఇంకా వెల్లడి కాలేదు. సెలక్టర్లు ఎవరిని కెప్టెన్ గా ఎంపిక చేస్తారనే దానిపై ప్రసారమాధ్యమాల్లో రకరకాల వార్తలు వస్తున్నాయి.

సూర్యకుమార్ యాదవ్ తో పాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా కెప్టెన్ రేసులో ఉన్నట్టు బీసీసీఐ విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టి20 టీమ్ కు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు ఐసీసీ టి20 ర్యాంకుల్లో నంబర్ 1 బ్యాటర్ గానూ కొనసాగుతున్నాడు. అయితే వన్డే ప్రపంచకప్ లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ ఆసియా గేమ్స్ లో జట్టును విజయపథంలో నడిపించి గోల్డ్ మెడల్ అందించాడు. దీంతో రుతురాజ్ పేరు కూడా సెలెక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది.

హార్దిక్ పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకుని సెలెక్షన్ కు అందుబాటులో ఉండటానికి సమయం పట్టే అవకాశం ఉందని, కాబట్టి కెప్టెన్ గా వేరేవారిని ఎంపిక చేయాల్సి రావొచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. భారత్, ఆస్ట్రేలియా టి20 సిరీస్ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు ఇండియాలో జరగనుంది. సిరీస్ లో భాగంగా రెండు జట్లు 5 మ్యాచ్ లు ఆడనున్నాయి.

Also Read: గిల్‌ను అభినందిస్తూ లవ్ సింబల్ తో సారా టెండూల్కర్ ట్వీట్.. అసలు విషయం తెలిసి అవాక్కవుతున్న నెటిజన్లు

ట్రెండింగ్ వార్తలు