Sara Tendulkar : గిల్‌ను అభినందిస్తూ లవ్ సింబల్ తో సారా టెండూల్కర్ ట్వీట్.. అసలు విషయం తెలిసి అవాక్కవుతున్న నెటిజన్లు

సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తనకు సంబంధించిన ఫొటోలను, విషయాలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటారు. ఆమె ట్విటర్ కు..

Sara Tendulkar : గిల్‌ను అభినందిస్తూ లవ్ సింబల్ తో సారా టెండూల్కర్ ట్వీట్.. అసలు విషయం తెలిసి అవాక్కవుతున్న నెటిజన్లు

Sara Tendulkar - Shubman Gill

Sara Tendulkar – Shubman Gill : టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెం.1 బ్యాటర్ గా నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ను వెనక్కు నెట్టి గిల్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. అంతేకాక.. ఈ ఘనత సాధించిన నాలుగో భారత్ ప్లేయర్ గా గిల్ రికార్డు సృష్టించాడు. శుభ్‌మన్‌ గిల్ వన్డే వరల్డ్ నెం.1 బ్యాటర్ గా ఘనత సాధించడంతో మాజీ, తాజా క్రికెటర్లు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ట్విటర్ ఖాతా నుంచి శుభ్‌మన్‌ గిల్ కు అభినందనలు తెలిపిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టులో శుభ్‌మన్‌ గిల్ ఫొటోతో పాటు క్యాప్షన్ రాసి లవ్ ఎమోజీ పెట్టి ఉంది. దీంతో సారా, గిల్ పై వస్తున్న రూమర్లు నిజమేనని నెటిజన్లు కామెంట్స్ చేశారు. అయితే, కొద్దిసేపటికే అసలు విషయం తెలిసి అవాక్కవ్వడం వారి వంతైంది.

Also Read : Sara Tendulkar : ప్రపంచ కప్ లో శుభ్‌మాన్ గిల్ సెంచరీ మిస్.. సారా టెండూల్కర్ స్పందన వైరల్‌

సారా టెండూల్కర్, శుభ్‌మన్‌ గిల్ మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు కొన్నిరోజులుగా విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీంతో సారా ఎక్కడ కనిపించినా శుభ్‌మన్‌ అభిమానులు గిల్ నామస్మరణ చేస్తున్నారు. దీనికితోడు ఇటీవల బాలీవుడ్ నటి సారా అలీఖాన్ ఓ టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సమయంలో గిల్, సారా అలీఖాన్ కు మధ్య ప్రేమాయణం నడుస్తుందని వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. శుభ్‌మన్‌ కు, నాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే.. అతను వేరే సారాతో ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. దీంతో సారా టెండూల్కర్, గిల్ మధ్య ప్రేమ వ్యవహారంపై వస్తున్న ప్రచారానికి బలంచేకూరినట్లయింది. ఈ క్రమంలోనే తాజాగా సారా టెండూల్కర్ టిట్వర్ ఖాతాలో గిల్ ఫొటో షేర్ చేయడం.. వరల్డ్ వన్డే నెం.1 బ్యాటర్ గా నిలిచినందుకు అభినందిస్తూ లవ్ సింబల్ పెట్టడం చర్చనీయాశంగా మారింది.

Also Read : NZ vs SL Today Match Prediction: న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ .. కివీస్ జట్టుకు కీలకం.. పొంచిఉన్న వర్షం ముప్పు.. పూర్తి వివరాలు ఇలా..

సారా టెండూల్కర్ తనకు సంబంధించిన ఫొటోలను, విషయాలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటారు. ఆమె ట్విటర్ కు దూరంగా ఉంటారని తెలుస్తోంది. గతంలో సారా టెండూల్కర్ పేరుపై ట్విటర్ లో నకిలీ ఖాతాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సారా ట్విటర్ లో అధికారికంగా తన ఉనికిని కొనసాగించడం లేదు. తాజాగా ఆమె పేరుపై ఉన్న ట్విటర్ ఖాతా ద్వారా గిల్ ఫొటో షేర్ చేయడం, లవ్ సింబల్ పెట్టడంతో ఆ ఫోస్ట్ విస్తృతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ ట్విటర్ ఖాతా సారా టెండూల్కర్ ది కాదని, ఆమె పేరుపై ఉన్న నకిలీ ఖాతా అని తెలుసుకొని నెటిజన్లు అవాక్కవుతున్నారు.