ఉప్పల్‌ మ్యాచ్‌లో 90 పరుగులు చేశాక సంజూ శాంసన్‌ రిస్క్‌ ఎందుకు తీసుకున్నాడు? అతడి సమాధానం ఇదే

సంజూ శాంసన్ మాత్రం 90 స్కోరు చేశాక కూడా దూకుడుగానే ఆడాడు. తాజాగా, బీసీసీఐ ఓ వీడియో షేర్ చేసింది.

Sanju Samson

ఇటీవల ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచులో టీమిండియా భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో సంజూ శాంసన్ 47 బంతుల్లో 111 పరుగులు చేయగా, సూర్య కుమార్ యాదవ్ 35 బంతుల్లో 75 రన్స్‌ కొట్టాడు.

దీంతో ఆ మ్యాచులో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లా విఫలం కావడంతో భారత్‌ 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సాధారణంగా 90 పరుగులు చేశాక బ్యాటర్లు కాస్త నెమ్మదిగా ఆడి శకతం బాదడానికి ప్రయత్నిస్తారు.

సంజూ శాంసన్ మాత్రం 90 స్కోరు చేశాక కూడా దూకుడుగానే ఆడాడు. తాజాగా, బీసీసీఐ ఓ వీడియో షేర్ చేసింది. అందులో సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ ఫన్నీగా మాట్లాడుకున్నారు. శతకం బాదడం గురించి శాంసన్‌ను సూర్యకుమార్ యాదవ్ అడిగాడు. 96 పరుగులు చేసిన సమయంలోనూ దూకుడుగా ఆడుతూ రిస్క్‌ ఎందుకు తీసుకున్నావని, ఆ సమయంలో శాంసన్ మనసులో ఏముందని సూర్యకుమార్ యాదవ్ అడిగాడు.

దీంతో శాంసన్ మాట్లాడుతూ… చాలా వారాల నుంచి జట్టులో మంచి వాతావరణాన్ని సృష్టించుకున్నామని అన్నాడు. దూకుడుగా ఆడుతూనే వినయపూర్వకంగా ఉండాలని దాని సందేశమని తెలిపాడు. ఈ రెండు పదాలనే తమ కెప్టెన్, కోచ్ గుర్తు చేస్తున్నారని చెప్పాడు. తన వ్యక్తిత్వానికి కూడా ఇది సరిపోతుందని, అదే మార్గంలో వెళ్లానని అన్నాడు.

శతకం బాదినందుకు చాలా హ్యాపీగా ఉన్నానని, దీన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పాడు. దేవునికి చాలా కృతజ్ఞతలు అని వ్యాఖ్యానించాడు. శతకం బాదడం సవాలుతో కూడుకున్నదని విషయమని, అయినప్పటికీ సాధించగలనన్న నమ్మకంతో ఉన్నానని తెలిపాడు. మైదానంలో తన పని తాను చేసుకుంటూ వెళ్లానని, తనపై తాను నమ్మకం ఉంచి ఆడానని అన్నాడు. తనతో కలిసి తన శతకాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సూర్యకుమార్ యాదవ్‌ కూడా క్రీజులో ఉన్నాడని చెప్పాడు.

IND vs NZ : భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?