Suryakumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్ ఆసియాక‌ప్‌లో మ‌రో 4 సిక్స‌ర్లు బాదితే..

టీ20 ఫార్మాట్‌లో జ‌ర‌గ‌నున్న ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav) మరో నాలుగు సిక్స‌ర్లు కొడితే..

Suryakumar needs 4 sixes in Asia Cup 2025 to surpass Nicholas Pooran on this list

Suryakumar Yadav : సెప్టెంబ‌ర్ 9 నుంచి యూఏఈ వేదిక‌గా ఆసియా క‌ప్ 2025 ప్రారంభం కానుంది. సూర్య‌కుమార్ యాద‌వ్ నాయ‌క‌త్వంలోనే భార‌త జ‌ట్టు ఈ మెగాటోర్నీలో బ‌రిలోకి దిగ‌నుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగ‌నున్న భార‌త్ మ‌రోసారి క‌ప్పును ముద్దాడాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. టీ20 ఫార్మాట్‌లో జ‌ర‌గ‌నున్న ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav) మరో నాలుగు సిక్స‌ర్లు కొడితే అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకుంటాడు. ఈ క్ర‌మంలో అత‌డు నికోల‌స్ పూర‌న్‌, గ్లెన్ మాక్స్ వెల్‌ను అధిగ‌మిస్తాడు.

Shreyas Iyer : 2027లో టీమ్ఇండియా వ‌న్డే కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో కీల‌క పాత్ర‌.. గ్రీన్‌స్టోన్ లోబో

ఇప్ప‌టి వ‌ర‌కు సూర్య‌కుమార్ యాద‌వ్ 83 మ్యాచ్‌ల్లో 146 సిక్స‌ర్లు బాదాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 148, నికోల‌స్ పూర‌న్ 149 సిక్స‌ర్లు కొట్టారు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన జాబితాలో టీమ్ఇండియా వ‌న్డే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. రోహిత్ 205 సిక్స‌ర్లు బాదాడు. ఆ త‌రువాత మార్టిన్ గుప్టిల్ (173), మ‌హ్మ‌ద్ వ‌సీం(168), జోస్ బ‌ట్లర్‌(160)లు ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

Jos Buttler : టీ20 క్రికెట్‌లో జోస్ బ‌ట్ల‌ర్ అరుదైన ఘ‌న‌త‌.. ధోని, దినేశ్ కార్తీక్ వంటి దిగ్గ‌జాల ఎలైట్ జాబితాలో చోటు..

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..
* రోహిత్ శర్మ (భార‌త్‌) – 205 సిక్స‌ర్లు
* మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్) – 173 సిక్సర్లు
* మ‌హ్మ‌ద్ వసీం (యుఏఈ) – 168 సిక్సర్లు
* జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) – 160 సిక్సర్లు
* నికోలస్ పూరన్ (వెస్టిండీస్) – 149 సిక్సర్లు
* గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) – 148 సిక్సర్లు
* సూర్య కుమార్ యాదవ్ (భార‌త్‌) – 146 సిక్స‌ర్లు

ఆసియాక‌ప్‌లో భార‌త్ త‌న తొలి మ్యాచ్‌ను సెప్టెంబ‌ర్ 10న యూఏఈతో ఆడ‌నుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య సెప్టెంబ‌ర్ 14న మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.