Suryakumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఊరిస్తోన్న అరుదైన రికార్డు.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసే అద్భుత అవ‌కాశం

Suryakumar Yadav-Virat Kohli : టీ20ల్లో నంబ‌ర్ 1 బ్యాట‌ర్ అయిన సూర్య‌కుమార్ యాద‌వ్ ముంగిట అద్భుత అవ‌కాశం ఉంది.

Virat Kohli-Suryakumar Yadav

టీ20ల్లో నంబ‌ర్ 1 బ్యాట‌ర్ అయిన సూర్య‌కుమార్ యాద‌వ్ ముంగిట అద్భుత అవ‌కాశం ఉంది. టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు, కింగ్ కోహ్లీ కి చెందిన ఓ రికార్డును బ్రేక్ చేసే సువ‌ర్ణావ‌కాశం సూర్యకు ప్ర‌స్తుతం వ‌చ్చింది. టీమ్ఇండియా త‌రుపున టీ20ల్లో అత్యంత వేగంగా రెండు వేల ప‌రుగులు పూర్తి చేసిన ఆట‌గాడిగా నిల‌వ‌నున్నాడు. ఇందుకు సూర్య‌కు మ‌రో 60 ప‌రుగులు అవ‌స‌రం. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది.

విరాట్ కోహ్లీ 56 టీ20 ఇన్నింగ్స్‌ల్లో రెండు వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. సూర్య‌కుమార్ ఇప్ప‌టి వ‌ర‌కు 52 మ్యాచులు ఆడి 1940 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు శ‌త‌కాలు, 16 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఆసీస్‌తో ప్ర‌స్తుతం భార‌త్ మ‌రో మూడు టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచుల్లో సూర్య ఇంకో 60 ప‌రుగులు చేస్తే విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ అవుతుంది. ప్ర‌స్తుతం సూర్య‌కుమార్ యాద‌వ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. దీంతో మంగ‌ళ‌వారం గౌహ‌తి వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న మూడో టీ20లో సూర్య ఈ రికార్డును బ్రేక్ చేసిన ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

Jasprit Bumrah: కొన్నిసార్లు నిశబ్దమే ఉత్తమం..! బూమ్రా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఎవరిని ఉద్దేశించి..? హార్దిక్ గురించేనా ..

ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు మాత్ర‌మే..

టీ20ల్లో ఇప్ప‌టి టీమ్ఇండియా త‌రుపున ముగ్గురు క్రికెట‌ర్లు మాత్ర‌మే రెండు వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్ లు మాత్ర‌మే రెండు వేల ప‌రుగులు పూర్తి చేశారు. విరాట్ కోహ్లీ 115 టీ20ల్లో 4008 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ శ‌త‌కం, 37 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక రోహిత్ శ‌ర్మ విష‌యానికి వ‌స్తే.. 148 మ్యాచుల్లో 4 సెంచ‌రీలు, 22 హాఫ్ సెంచ‌రీల సాయంతో 3853 ప‌రుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 72టీ20 మ్యాచుల్లో 2256 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు శ‌త‌కాలు, 22 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు