Jasprit Bumrah: కొన్నిసార్లు నిశబ్దమే ఉత్తమం..! బూమ్రా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఎవరిని ఉద్దేశించి..? హార్దిక్ గురించేనా ..

2022 సెప్టెంబర్ నుంచి బూమ్రా వెన్ను నొప్పితో బాధపడుతూ అంతర్జాతీయ మ్యాచ్ లకు దూరమయ్యాడు. సుదీర్ఘ కాలం తరువాత ఈ ఏడాది ఆగస్టులో ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ తో బూమ్రా మళ్లీ జట్టులో చేరాడు.

Jasprit Bumrah: కొన్నిసార్లు నిశబ్దమే ఉత్తమం..! బూమ్రా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఎవరిని ఉద్దేశించి..? హార్దిక్ గురించేనా ..

Jasprit Bumrah

World Cup 2023 campaign. టీమిండియా పాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆసక్తికర పోస్టు చేశాడు. కొన్నిసార్లు నిశబ్దమే ఉత్తమం అంటూ రాశాడు. దీనిపై ఆసక్తికర చర్చ సాగుతుంది. బూమ్రా ఎవరిని ఉద్దేశించి ఇలా రాశాడోనని క్రికెట్ అభిమానుల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో బూమ్రా అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఆడిన ప్రతీ మ్యాచ్ లోనూ నిలకడగా వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు. ఈ మెగా టోర్నీలో బూమ్రా మొత్తం 14వికెట్లు పడగొట్టాడు.

Also Read : Shubman Gill : అందుకోసం ఎదురు చూస్తున్నా..! కెప్టెన్ గా నియామకం తరువాత శుభమాన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

2022 సెప్టెంబర్ నుంచి బూమ్రా వెన్ను నొప్పితో బాధపడుతూ అంతర్జాతీయ మ్యాచ్ లకు దూరమయ్యాడు. సుదీర్ఘ కాలం తరువాత ఈ ఏడాది ఆగస్టులో ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ తో బూమ్రా మళ్లీ జట్టులో చేరాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. మరో బౌలర్ మహ్మద్ షమీతో కలిసి ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించడంలో సఫలమయ్యాడు. తాజాగా బూమ్రా ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్టుపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Also Read : Rishabh Pant : బ‌ల‌వంతం చేయొద్దు..రిష‌బ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ.. ఎవ‌రిని ఉద్దేశించి..?

తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ‘ కొన్నిసార్లు నిశబ్దమే ఉత్తమ సమాధానం’ అంటూ బూమ్రా రాశాడు. ఐపీఎల్ లో బుమ్రా ముంబై జట్టుకు ఆడుతున్నాడు. ఆ జట్టులో కెప్టెన్ రోహిత్ తరువాత బూమ్రా కీలక ప్లేయర్ గా ఉన్నాడు. రోహిత్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ బూమ్రా అవుతాడని ప్రచారంకూడా జరిగింది. కానీ, ఐపీఎల్ 2024 సీజన్ కు గాను హార్దిక్ పాండ్యా మళ్లీ జట్టులోకి చేరబోతున్నాడు. హార్దిక్ ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా కొందరు కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ తరువాత పాండ్యా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ తరువాత తనకు దక్కాల్సిన కెప్టెన్ స్థానాన్ని హార్దిక్ తన్నుకుపోతున్నాడనే విషయాన్ని ప్రస్తావిస్తూ బుమ్రా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో అలారాసి ఉంటాడని పలువురు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.