Shubman Gill : అందుకోసం ఎదురు చూస్తున్నా..! కెప్టెన్ గా నియామకం తరువాత శుభమాన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

2022లో ఐపీఎల్ టోర్నీలోకి గుజరాత్ టైటాన్స్ జట్టు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు రెండు ఐపీఎల్ సీజన్ లలో పాలుపంచుకుంది. రెండు సీజన్లకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరించాడు.

Shubman Gill : అందుకోసం ఎదురు చూస్తున్నా..! కెప్టెన్ గా నియామకం తరువాత శుభమాన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Shubman Gill

Updated On : November 28, 2023 / 10:48 AM IST

IPL 2024 : Shubman Gill : ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండు సీజన్ లలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ జట్టుకు వెళ్లాడు. హార్ధిక్ జట్టును వీడటంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా శుభమాన్ గిల్ ను ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. 24ఏళ్ల ఓపెనర్ ఈ ఏడాది ఐపీఎల్ లో అత్యధిక పరుగులు (890) చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2022లో ఐపీఎల్ లో అడుగుపెట్టిన టైటాన్స్ మొదట జట్టులోకి తీసుకున్న ముగ్గురు (హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్) ఆటగాళ్లలో శుభమాన్ గిల్ ఒకడు.

Also Read : IPL 2024 : ఐపీఎల్ పై పాకిస్థాన్ బౌలర్ కీలక వ్యాఖ్యలు.. మనసులో మాట బయటపెట్టేశాడు..

గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ గా నియమితుడైన తరువాత శుభమాన్ స్పందించాడు. ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టైటాన్స్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా, గర్వంగా అనిపిస్తోంది. ఇలాంటి ఉత్తమ జట్టును నడిపించగలనని నాపై నమ్మకం పెట్టిన ఫ్రాంచైజీకి ధన్యవాదాలు. రెండు సీజన్లు మాకు అద్భుతంగా గడిచాయి. వచ్చే సీజన్ లో విజయవంతంగా జట్టును నడిపించేందుకు ఎదురు చూస్తున్నా అంటూ శుభమాన్ గిల్ పేర్కొన్నాడు.

Also Read : Minister Roshan Ranasinghe : శ్రీలంక క్రీడా మంత్రిపై వేటు.. శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో జోక్యమే కారణమా?

2022లో ఐపీఎల్ టోర్నీలోకి గుజరాత్ టైటాన్స్ జట్టు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు రెండు ఐపీఎల్ సీజన్ లలో పాలుపంచుకుంది. రెండు సీజన్లకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరించాడు. 2022లో టైటిల్ ను కైవసం చేసుకోగా.. ఈ ఏడాది ఫైనల్ వరకు జట్టు చేరింది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులోకి వెళ్లడంతో 2024 సీజన్ లో గిల్ సారథ్యంలో జట్టు ఆటతీరు ఎలా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఇదిలాఉంటే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా శుభమాన్ గిల్ నియామకంపై జట్టు డైరెక్టర్ విక్రమ్ సోలంకి స్పందించాడు. గత రెండేళ్లుగా క్రికెట్లో గిల్ తనదైన వృద్ధి చూపిస్తున్నాడు. కేవలం బ్యాటర్ గానే కాదు.. కెప్టెన్ గానూ అతనిలో పరిణతి చూశాం. అలాంటి యువ నాయకుడితో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పాడు.