Minister Roshan Ranasinghe : శ్రీలంక క్రీడా మంత్రిపై వేటు.. శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో జోక్యమే కారణమా?

భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో టోర్నీలో శ్రీలంక జట్టు ఘోర పరాభవం చెందింది. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన శ్రీలంక కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది.

Minister Roshan Ranasinghe : శ్రీలంక క్రీడా మంత్రిపై వేటు.. శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో జోక్యమే కారణమా?

Sports Minister Roshan Ranasinghe

Updated On : November 28, 2023 / 9:26 AM IST

Sri Lanka Cricket board : శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘేపై వేటు పడింది. క్రీడల మంత్రిగా రోషన్ ను తప్పిస్తూ ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆయనకు ఉన్న మిగతా మంత్రిత్వ శాఖలనూ తొలగించారు. దీనికి ప్రధాన కారణం శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) లో జోక్యం చేసుకోవటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మంత్రిపై వేటు వేయడం ద్వారా బోర్డులో రాజకీయ జోక్యం కారణంగా శ్రీలంక క్రికెట్ పై ఐసీసీ విధించిన నిషేధాన్ని తొలగించుకునే దిశగా ఆ దేశం తొలి అడుగు వేసింది. మంత్రిపై వేటుకు మరోకారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఆ దేశ అధ్యక్షుడికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో రోషన్ ఆరోపణలు చేశాడు. ఈ కారణంతోనే రోషన్ ను మంత్రిగా తప్పించారని తెలుస్తోంది. మంత్రి తొలగింపు నిర్ణయం పట్ల శ్రీలంక క్రికెట్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Also Read : Sri Lanka Cricket Board : శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు.. ఆదేశ క్రీడల శాఖ మంత్రి సంచలన నిర్ణయం.. ఎందుకంటే?

భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో టోర్నీలో శ్రీలంక జట్టు ఘోర పరాభవం చెందింది. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన శ్రీలంక కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. ఈ క్రమంలో ఆ దేశ క్రీడల శాఖ మంత్రి రోషన్ రణసింఘే మొత్తం ఎస్ఎల్సీ బోర్డును రద్దు చేశాడు. మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ నేతృత్వంలో తాత్కాలికంగా కొత్త కమిటీని నియమించారు. ఏడుగురు సభ్యులతో ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ లో రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మాజీ బోర్డు అధ్యక్షుడు కూడా ఉన్నారు. 1973 లోని స్పోర్ట్స్ లా నెంబర్ 25 అధికారాల ప్రకారం రణసింఘే ఈ కమిటీని నియమించినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికితోడు క్రికెట్ బోర్డుపై వేటు వేయాలని ఐసీసీకి లేఖ రాశారు. దీంతో క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యం చేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఐసీసీ శ్రీలంక క్రికెట్ బోర్డుపై వేటు వేసింది.

Also Read : IPL 2024 : అధికారిక ప్రకటన వచ్చేసింది..! ముంబై జట్టులోకి హార్థిక్.. గుజరాత్ కెప్టెన్ గా గిల్ .. ఆర్సీబీలోకి గ్రీన్

కేంద్ర మంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాత క్రికెట్ బోర్డు సభ్యులు శ్రీలంక దేశ సుప్రీంకోర్టుకు వెళ్లారు. క్రీడల శాఖ ఇచ్చిన ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా రోషన్ రణసింఘే సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ బోర్డులో అవినీతిని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్న తనను ప్రధాని హత్య చేయించేందుకు కుట్ర పన్నారని రోషన్ ఆరోపించారు. తనకేమైనా జరిగితే దానికి ప్రధానే బాధ్యత వహించాలని రోషన్ ఆరోపణలు చేశారు. క్రికెట్ బోర్డులోని అవినీతిని అంతం చేసే క్రమంలో నన్ను చంపేస్తారేమోననే భయం కలుగుతోంది. నడి రోడ్డుపైనే హత్య చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా ఏదైనా జరిగితే మాత్రం ప్రధానితోపాటు స్టాఫ్ చీఫ్ దే బాధ్యత అని రోషన్ రణసింఘే వ్యాఖ్యానించాడు. దీంతో ఇవాళ కేబినెట్ మీటింగ్ కు ముందే రోషన్ ను మంత్రి వర్గం నుంచి తప్పిస్తూ ప్రధాని రణిల్ విక్రమ సింఘే కీలక నిర్ణయం తీసుకున్నారు.