IND vs SA T20 Match : సౌతాఫ్రికా జట్టుపై ఓటమి తరువాత సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే?

సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అతితక్కువ ఇన్నింగ్స్ ల్లో 2వేల పరుగులు చేసి భారత ప్లేయర్స్ లో కోహ్లీ సరసన నిలిచాడు.

Suryakumar Yadav

Suryakumar Yadav : భారత్ జట్టుపై సౌతాఫ్రికా విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ లు ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ విధానంలో సఫారీల లక్ష్యాన్ని అంపైర్లు కుదించారు. 15 ఓవర్లకు 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ బ్యాటర్లు ఆది నుంచి దూకుడుగాఆడి 13.5 ఓవర్లలోనే 5వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించారు. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు ఓటమికి కారణాలను వెల్లడించారు.

Also Read : India vs South Africa 2nd T20 : దంచికొట్టిన రింకు సింగ్, సుర్యకుమార్ యాదవ్.. అయినా తప్పని ఓటమి

ఈ మ్యాచ్ లో మేము విన్నింగ్ స్కోర్ చేశాం. కానీ, సౌతాఫ్రికా ప్లేయర్స్ మొదటి ఐదారు ఓవర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. దీంతో అప్పుడే మా నుంచి మ్యాచ్ దూరం చేశారు. ఇక్కడ రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయడం కాస్త కష్టమే. బంతి తడిగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ మేము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది.. కాబట్టి ఈ మ్యాచ్ మాకు గుణపాఠం. మూడో మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని సూర్యకుమార్ యాదవ్ అన్నారు.

Also Read : Anushka And Virat Kohli : కోహ్లీ, అనుష్కల వివాహ వార్షికోత్సవ ఫొటోలు వైరల్.. అనుష్కశర్మ ఏమన్నదంటే?

టీమిండియా గేమ్ ప్లాన్ పై మీరేమంటారని ప్రశ్నించగా.. ప్రతిఒక్కరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని స్పష్టమైన సందేశం ఉందని సూర్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా డ్రెస్సింగ్ రూంలో టీం సభ్యుల మధ్య సంఖ్యత గురించి మాట్లాడుతూ.. మా డ్రెస్సింగ్ రూంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఉత్సాహంతో నిండి ఉంటుంది. మైదానంలో ఏం జరిగినా మైదానంలోనే వదిలేయమని మా జట్టు సభ్యులకు చెప్పానని సూర్యకుమార్ యాదవ్ అన్నారు.

Also Read : England squad : భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లాండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. ముగ్గురు కొత్త ముఖాల‌కు చోటు

మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అతితక్కువ ఇన్నింగ్స్ ల్లో 2వేల పరుగులు చేసి భారత ప్లేయర్స్ లో కోహ్లీ సరసన నిలిచాడు. భారత్ ఆటగాళ్లలో 2వేల పరుగులు చేసిన నాలుగో ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. సూర్యాకంటే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. టీ20ల్లో అతితక్కువ ఇన్నింగ్స్ లో 2వేల పరుగులు చేసిన ఆటగాళ్లలో పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ అజం, మహమ్మద్ రిజ్వాన్లు ఉన్నారు. వారు 52 మ్యాచ్ ల్లో 2వేల పరుగులు పూర్తి చేశారు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లు 56 మ్యాచ్ లలో రెండు వేల పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 58 మ్యాచ్ లలో 2వేల పరుగులు పూర్తి చేశాడు.