Viral Video : నీటి ప్ర‌వాహ‌మే పిచ్‌.. కాలువ‌కు అటువైపు బ్యాట‌ర్‌.. ఇటు వైపు బౌల‌ర్‌.. ఇది నెక్ట్స్ లెవెల్ క్రికెట్‌

మ‌న దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Swimket Players Engaging In An Aquatic Version Of Cricket

Viral Video : మ‌న దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. క్రికెట్‌ను ఓ ఆట‌లా కాదు ఓ మ‌తంలా భావిస్తారు. ఏ మాత్రం స‌మ‌యం దొరికినా, ఎంత త‌క్కువ స్థ‌లంలోనైనా యువ‌త క్రికెట్ ఆడేస్తుంటారు. గ‌ల్లీలోనే కాదు కొండ‌ల్లోనూ మాకు అడ్డుకాదంటూ క్రికెట్ ఆడేస్తున్న వీడియోలను ఇప్ప‌టికే చూసాం. అయితే.. ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియో చూస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోక మాన‌రు.

ఈ వీడియోలో.. ఓ వైపున బ్యాట‌ర్ ఉండ‌గా మ‌రో వైపు బౌల‌ర్ ఉన్నాడు. మ‌ధ్య‌లో కాలువ ఉంది. దాదాపు మోకాళ్ల వ‌ర‌కు నీళ్లు ఉన్నాయి. నీటినే పిచ్‌గా ఉప‌యోగించారు. బౌల‌ర్ బాల్ వేయ‌గా నీళ్ల‌లో ప‌డిన బంతి పైకి లేవ‌గా బ్యాట‌ర్ షాట్ ఆడాడు. బంతి నీళ్ల‌లో ప‌డ‌గా దాన్ని అందుకునేందుకు ఫీల్డ‌ర్లు నీళ్ల‌లోకి డైవ్ చేశారు.

ICC Under 19 World Cup 2024 : అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లిన టీమ్ఇండియా.. సెమీస్‌లో ద‌క్షిణాఫ్రికా పై విజ‌యం

అదే స‌మ‌యంలో ప‌రుగు తీసేందుకు బ్యాట‌ర్లు సైతం నీళ్ల‌లోకి దిగి ఈదుకుండా ప‌రుగు తీసేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. అప్ప‌టికే బంతి అందుక‌న్న ఫీల్డ‌ర్ బౌల‌ర్ త్రో చేయ‌గా బౌల‌ర్ వికెట్లను ప‌డ‌గొట్టాడు. దీంతో బ్యాట‌ర్ ర‌నౌట్ అయ్యాడు.

ఈ వీడియోని Madan_Chikna అనే వినియోగ‌దారుడు ఎక్స్‌(గ‌తంలో ట్విటర్‌)లో షేర్ చేశాడు. ఒలింపిక్స్‌లో దీన్ని స్విమ్మింగ్ స్పోర్ట్స్‌లో యాడ్ చేస్తే దీన్ని స్విమ్‌కెట్ అని పిలుస్తాము అంటూ రాసుకొచ్చాడు. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా ఇది నెక్ట్స్ లెవెల్ క్రికెట్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Mumbai Indians : రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డానికి గ‌ల కార‌ణాన్ని చెప్పిన ముంబై కోచ్‌.. స్పందించిన హిట్‌మ్యాన్ భార్య‌

ట్రెండింగ్ వార్తలు