Syed Mushtaq Ali Trophy 2025 Devdutt Padikkal scores 45 ball century
Devdutt Padikkal : కర్ణాటక స్టార్ ఆటగాడు దేవదత్ పడిక్కల్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో దుమ్ములేపాడు. తమిళనాడుతో మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్ 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు.
🚨 DEVDUTT PADDIKAL SMASHED HUNDRED FROM JUST 45 BALLS IN SYED MUSHTAQ ALI 🚨
– The Star Boy of Karnataka & RCB, 102* from just 46 balls including 10 fours & 6 sixes against Tamil Nadu. 🔥 pic.twitter.com/7XnnntLEu2
— Johns. (@CricCrazyJohns) December 2, 2025
పడిక్కల్‌తో పాటు శరత్ (53; 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), స్మరణ్ రవిచంద్రన్ (46 నాటౌట్; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోరు సాధించింది. మిగిలిన ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్ (24; 15 బంతుల్లో 4 ఫోర్లు) పర్వాలేదనిపించగా, కరుణ్ నాయర్ (4) ఘోరంగా విఫలం అయ్యాడు.
తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. టి నటరాజన్ ఓ వికెట్ తీశారు.