T Golf Foundation Hyderabad open will Starts from wednesday
Hyderabad open Golf : టీ గోల్ఫ్ ఫౌండేషన్ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి శ్రీకారం చుట్టింది. గచ్చిబౌలీలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ తో కలిసి అమెచ్యూర్ గోల్ఫ్ క్రీడాకారుల కోసం హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ ను నిర్వహిస్తోంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు జరగనుంది. ఈ టోర్నీకి బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
కాగా.. ఈ టోర్నీకి సంబంధించిన జెర్సీలను సోమవారం ఆర్గనైజర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీ గోల్ఫ్ ఫౌండర్ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న అమెచ్యూర్ గోల్ఫర్లందరికీ ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్ ఓపెన్ అమెచ్యూర్ గోల్ఫ్ లో ఒక చారిత్రక మైలురాయిగా పేర్కొన్నారు.
స్ట్రోక్ ప్లే పద్దతిలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. విజేతలకు ట్రోఫీలు అందజేయనున్నట్లు చెప్పారు. లాంగెస్ట్ డ్రైవ్, స్టెయిటెస్ట్ డ్రైవ్, క్లోజెస్ట్ పిన్ వంటి పలు కేటగిరీల్లో కూడా ట్రోఫీలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రావు, రూబిన్ చెరియన్, జాగిల్ ఫౌండర్, రాజ్ పి నారాయణం, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.