T20 World Cup 2021 : 130 పరుగుల భారీ తేడాతో అప్ఘానిస్తాన్ ఘన విజయం

టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 పోరులో స్కాట్లాండ్ తో జరిగిన పోరులో అఫ్ఘానిస్తాన్ క్రికెటర్లు అదరగొట్టారు. 130 పరుగుల భారీ తేడాతో స్కాట్లాండ్ పై ఘన విజయం సాధించింది అప్ఘాన్ జట్టు. ఈ మ్

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 పోరులో స్కాట్లాండ్ తో జరిగిన పోరులో అఫ్ఘానిస్తాన్ క్రికెటర్లు అదరగొట్టారు. 130 పరుగుల భారీ తేడాతో స్కాట్లాండ్ పై ఘన విజయం సాధించింది అప్ఘాన్ జట్టు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన అప్ఘాన్ భారీ స్కోర్ చేసింది. అప్ఘాన్ బ్యాటర్లు చెలరేగారు. పరుగుల వరద పారించారు. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది అప్ఘాన్.

Mohammed Shami : పాకిస్తాన్ వెళ్లిపో, దేశద్రోహి, ఎంత డబ్బు తీసుకున్నావ్… భారత క్రికెటర్‌పై పచ్చి బూతులు

191 పరుగుల టార్గెతో బరిలోకి దిగిన స్కాట్లాండ్.. 60 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్కాట్లాండ్ జట్టులో ఐదుగురు బ్యాట్స్ మెన్ డకౌట్ అయ్యారు. అప్ఘాన్ బౌలర్లలో ముజిబ్ ఉర్ రెహ్మాన్ 5 వికెట్లు, రషీద్ ఖాన్ 4 వికెట్లు తీసి స్కాట్లాండ్ వెన్ను విరిచారు. నవీన్ ఉల్ హక్ ఒక వికెట్ తీశాడు. 10.2 ఓవర్లలోనే 60 పరుగులకే స్కాట్లాండ్ ఆలౌట్ అయ్యింది. అప్ఘాన్ బౌలర్లలో

ముందు బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్ జట్టులో.. ఓపెనర్ హజ్రతుల్లా జాజాయ్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 44 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మహ్మద్ షాజాద్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 22 పరుగులు చేశాడు.

తొలి వికెట్ కు 54 పరుగులు జోడించి ఓపెనర్లు పునాది వేయగా.. నజీబుల్లా, గుర్బాజ్ స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. నజీబుల్లా 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు సాధించాడు. గుర్బాజ్ 37 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 46 పరుగులు నమోదు చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో సఫ్యాన్ షరీఫ్ 2 వికెట్లు తీశాడు. డేవీ, మార్క్ వాట్ తలో వికెట్ తీశారు.

ట్రెండింగ్ వార్తలు