Mohammed Shami : పాకిస్తాన్ వెళ్లిపో, దేశద్రోహి, ఎంత డబ్బు తీసుకున్నావ్… భారత క్రికెటర్‌పై పచ్చి బూతులు

పాక్ చేతిలో ఓటమిని టీమిండియా ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. వాళ్లు ఇంకా షాక్ లోనే ఉన్నారు. పాక్ చేతిలో పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Mohammed Shami : పాకిస్తాన్ వెళ్లిపో, దేశద్రోహి, ఎంత డబ్బు తీసుకున్నావ్… భారత క్రికెటర్‌పై పచ్చి బూతులు

Mohammed Shami

Mohammed Shami : టీ20 వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారత ఘోర పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఈ ఓటమిని టీమిండియా ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. వాళ్లు ఇంకా షాక్ లోనే ఉన్నారు. పాక్ చేతిలో పరాజయాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు నిద్ర లేని రాత్రి గడిపారు.

T20 World Cup 2021: విరాట్ కోహ్లీ పేరిట కెప్టెన్ గా నమోదైన చెత్త రికార్డు.., గొప్ప రికార్డు

ఈ క్రమంలో కొందరు అభిమానులు హద్దులు మీరారు. భారత జట్టు క్రికెటర్లను టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో వారిపై విరుచుకుపడుతున్నారు. కొందరైతే మన ఆటగాళ్లను పచ్చి బూతులు కూడా తిడుతున్నారు.

T20 World Cup 2021: టీమిండియా మరీ ఇంత చెత్త ప్రదర్శన.. ఓటమి కాదిది ఘోర పరాభవం

మరీ ముఖ్యంగా భారత బౌలర్ మహమ్మద్ షమీని(31) దారుణంగా టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో షమీపై అసభ్యకర రీతిలో పోస్టులు పెడుతున్నారు. ”ఇండియా టీమ్ లో ఓ పాకిస్తానీ ఉన్నాడు. పాక్ కి మద్దతిచ్చావ్. పాకిస్తాన్ నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నావ్. దేశద్రోహి. రిటైర్మెంట్ తీసుకో. ఇక పాకిస్తాన్ కు వెళ్లిపో బోసిడీకే” అంటూ దారుణమైన కామెంట్లు చేశారు. కాగా, నిన్నటి మ్యాచ్ లో షమీ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. 3.5 ఓవర్లలో 45 రన్స్ ఇచ్చాడు. ఇది ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది.

కాగా, ఈ క్లిష్ట పరిస్థితుల్లో షమీకి మాజీ భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అండగా నిలిచాడు. షమీపై జరుగుతున్న దాడిని సెహ్వాగ్ ఖండించాడు. ”షమీపై ఆన్ లైన్ లో దాడి జరగడం షాకింగ్ ఉంది. ఇలాంటి సమయంలో మనం విమర్శలు చేయకూడదు. వారికి అండగా ఉండాలి. షమీ ఒక చాంపియన్. ఇండియా క్యాప్ పెట్టుకున్న ప్రతి ఒక్కరి గుండెలో ఇండియా ఉంటుంది. షమీ మేమంతా నీ వెంటే ఉన్నాము.. నెక్స్ట్ మ్యాచ్ లో నీ సత్తా చూపించు” అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

టీ20 వరల్డ్ కప్ 2021 లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ముందు పాక్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఆ తర్వాత బ్యాటర్లు అదరగొట్టారు. పాకిస్తాన్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. పాక్ ఓపెనర్లు రిజ్వాన్‌, బాబర్ అజమ్‌లు భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టించారు. ఎక్కడా తడబడకుండా ధాటిగా ఆడి జట్టుకి అపూర్వ విజయాన్ని అందించారు. భారత్‌ నిర్దేశించిన 151 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ సునాయాసంగా చేధించింది. ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా జయ కేతనాన్ని ఎగరవేసింది. టీ20 ప్రపంచకప్ లో భారత్ పై పాకిస్తాన్ గెలవడం ఇదే తొలిసారి. టీ 20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ 5 సార్లు తలపడ్డాయి. అన్ని సార్లు ఇండియానే గెలిచింది. ఈసారి మాత్రం పాకిస్తాన్ సంచలన విజయంతో హిస్టరీ క్రియేట్ చేసింది.