T20 World Cup 2021 : వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌కు వరుసగా నాలుగో విజయం

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. పాకిస్తాన్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. పసికూన నమీబియాపై 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. పాకిస్తాన్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. పసికూన నమీబియాపై 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని నమీబియా చేజ్ చేయలేకపోయింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. నమీబియా బ్యాటర్లలో ఓపెనర్ బార్డ్ 29 పరుగులు చేశాడు. క్రెయిగ్ విలియమ్స్ (40), డేవిడ్ వీస్(43*) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో హసన్ అలీ, ఇమద్ వసీమ్, రౌఫ్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీశారు.

WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ కు దిగింది. పసికూన నమీబియాపై పాకిస్తాన్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. పరుగుల వరద పారించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 189 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. పాక్ ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ అజాం, మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ నమీబియా బౌలింగ్ ను చీల్చి చెండాడారు.

Diabetes : షుగర్ వ్యాధి గ్రస్తులు తీపిపదార్ధాలు తింటే ప్రమాదమా?..

రిజ్వాన్ 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ బాబర్ అజాం 49 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసి వీజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఫకార్ జమాన్ (5) విఫలమైనా, సీనియర్ ఆటగాడు మహ్మద్ హఫీజ్ 16 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. హఫీజ్ స్కోరులో 5 ఫోర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ లో ఏ దశలోనూ నమీబియా బౌలర్లు పాక్ బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి తీసుకురాలేకపోయారు. దాంతో పాక్ ఆటగాళ్లు పరుగుల వరద పారించారు.

ట్రెండింగ్ వార్తలు