WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ పేమెంట్స్ ద్వారా క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. వాట్సాప్ పేమెంట్స్ ద్వారా లావాదేవీలు జరిపిన యూజర్లు క్యాష్ బ్యాక్ ఆఫర్లు పొందవచ్చు.

WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

Whatsapp Cashback Whatsapp Users Can Get Cashback With Payments

WhatsApp Cashback: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ పేమెంట్స్ ద్వారా క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. వాట్సాప్ పేమెంట్స్ ద్వారా లావాదేవీలు జరిపిన యూజర్లకు వాట్సాప్ నుంచి క్యాష్ బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. వాస్తవానికి ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ల గురించి వాట్సాప్ అధికారికంగా ఇప్పటివరకూ ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి ఈ వాట్సాప్ పేమెంట్స్ క్యాష్ బ్యాక్ ఆప్షన్ వాట్సాప్ బీటా యూజర్ల ద్వారా టెస్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వాట్సాప్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఎంపిక చేసిన బీటా యూజర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మేరకు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది.

ఇప్పటికే పలువురు బీటా యూజర్స్ రూ. 51 క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందినట్లు స్క్రీన్ షాట్లు ట్వీట్ చేశారు. ఒక క్యాష్ బ్యాక్ మాత్రమే కాదు.. కంగ్రాచ్యులేషన్ మెసేజ్ కూడా వాట్సాప్ పంపుతున్నట్లు ఉంది. వాట్సాప్ పేమెంట్స్ ద్వారా ఐదుగురు యూజర్లు UPI చెల్లింపులు చేయడం ద్వారా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. తద్వారా రూ.51 క్రెడిట్ అవుతాయి. బీటా యూజర్లలో  ఈ క్యాష్ బ్యాక్ ఫీచర్ టెస్టింగ్ చేసేందుకు ఏ ప్రాతిపదికన బీటా యూజర్ వాట్సాప్ ఎంపిక చేసిందనే దానిపై స్పష్టతలేదు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 2.21.22.21, iOS 2.21.220.14 బీటా వెర్షన్స్ ద్వారా టెస్టింగ్ చేస్తున్నట్టు WABetaInfo వెల్లడించింది.
Read Also : WhatsApp Stop Nov 1 : మీ వాట్సాప్ పనిచేస్తుందా? ఈ రోజు నుంచి ఈ ఫోన్లలో పనిచేయదు!

ఈ ఫీచర్ సాధారణ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. వాట్సాప్ పేమెంట్స్ ద్వారా ఎక్కువ మంది యూజర్లు పేమెంట్స్ చేసేలా ప్రోత్సహించేందుకే ఈ ఆఫర్ అందించనున్నట్టు తెలిపారు. ఇక వాట్సాప్ పేమెంట్ సర్వీసులను ప్రారంభించిన తొలిరోజుల్లో గూగుల్ పే (Google Pay) కూడా స్క్రాచ్ కార్డుల రూపంలో క్యాష్ బ్యాక్ అందించింది. అలాగే ఇతర డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాంలైన పేటీఎం, ఫోన్ పే కూడా ఈ తరహా క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించాయి. వాట్సాప్ పేమెంట్స్ కొత్తగా స్టిక్కర్స్ ఫీచర్ కూడా తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ పేమెంట్స్ చేసినప్పుడు మెసేజ్ లకు బదులుగా స్టిక్కర్లను పంపుకోవచ్చు. వాట్సాప్ పేరంట్ కంపెనీ ఫేస్ బుక్ పేరును మెటాగా మారుస్తున్నట్టు సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. ఇకపై ఫేస్‌బుక్ చెందిన అన్ని సంస్థలకూ మెటా పేరెంట్ కంపెనీగా వ్యవహరించనుంది. వాట్సాప్ ఫ్రమ్ ఫేస్ బుక్‌కు బదులుగా వాట్సాప్ ఫ్రమ్ మెటా అనే పేరు కనిపిస్తుందని  వాట్సాప్ బీటా యూజర్లు చెబుతున్నారు.
Read Also : Whatsapp Web : వాట్సాప్ వెబ్‌లోనూ కొత్త ప్రైవసీ ఆప్షన్..!