Whatsapp Web : వాట్సాప్ వెబ్‌లోనూ కొత్త ప్రైవసీ ఆప్షన్..!

వాట్సాప్ డెస్క్ టాప్ వెబ్ వెర్షన్ (Whatsapp Web)లో కొత్త ఫీచర్ వస్తోంది. అదే.. ప్రైవసీ ఆప్షన్.. డెస్క్ టాప్ వెర్షన్ కోసం వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్ తెచ్చేందుకు వర్క్ చేస్తోంది.

Whatsapp Web : వాట్సాప్ వెబ్‌లోనూ కొత్త ప్రైవసీ ఆప్షన్..!

New Update Whatsapp Web To Get New Privacy Option

Whatsapp Web Privacy Option : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ డెస్క్ టాప్ వెబ్ వెర్షన్ (Whatsapp Web)లో కొత్త ఫీచర్ వస్తోంది. అదే.. ప్రైవసీ ఆప్షన్.. స్మార్ట్ ఫోన్ వాట్పాప్ మాదిరిగానే ఇకపై వాట్సాప్ వెబ్ యూజర్లు కూడా తమ ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. WABetainfo ప్రకారం.. డెస్క్ టాప్ వెర్షన్ కోసం వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్ తెచ్చేందుకు వర్క్ చేస్తోంది. ఇటీవలే మొబైల్ వాట్సాప్ లో ప్రైవసీ అప్ డేట్ సెట్టింగ్స్ మార్చుకునేందుకు వీలు కల్పించింది. మీ ఫోన్ లోని వాట్సాప్ అకౌంట్ ను మల్టీడివైజ్ లకు కనెక్ట్ చేసుకునేందుకు ఈ వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ అనుమతినిస్తుంది.
WhatsApp Web కొత్త ఫీచర్లు : డెస్క్‌టాప్‌ నుంచి వీడియో, వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు!

అయితే.. మరికొన్ని ఫీచర్లను తీసుకొచ్చేందుకు మెసేంజర్ యాప్ పనిచేస్తున్నట్టు WABetainfo నివేదిక పేర్కొంది. Desktop Settings ద్వారా వాట్సాప్ వెబ్ యూజర్లు సులభంగా తమ ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకునేందుకు ఈ కొత్త అప్ డేట్ ద్వారా వీలుపడనుంది. ఈ ప్రైవసీ ఆప్షన్ ద్వారా Last Seen, Profile Photo, About సెక్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు.

అంతేకాదు.. వాట్సాప్ యూజర్లు Read Recipts ఎనేబుల్ చేయడం లేదా డిజేబుల్ చేసుకోవచ్చు. అలాగే WhatsApp Groupsలో ఎవరిని యాడ్ చేయాలో లేదో కూడా సెట్ చేసుకోవచ్చు. గతంలో ఇక్కడే యూజర్ల ఫోన్ నెంబర్లను Block చేసే ఆప్షన్ ఉండగా.. అది ఇప్పుడు ఈ కొత్త సెక్షన్ లోకి మారిపోయింది. కొత్త ప్రైవసీ ఆప్షన్ కు సంబంధించి ఇప్పటివరకూ వాట్సాప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన రివీల్ చేయలేదు.
WhatsApp Web: డెస్క్‌టాప్, వాట్సప్ వెబ్‌లో ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు!!