WhatsApp Web: డెస్క్‌టాప్, వాట్సప్ వెబ్‌లో ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు!!

వాట్సప్‌లో మరో సరికొత్త ఆప్షన్ వచ్చింది. ఇంతకుముందెన్నడూ లేని ఫొటో ఎడిటింగ్ ఆప్షన్ ను మొబైల్ వెర్షన్ లో అందుబాటులోకి తెచ్చింది. వాట్స‌ప్ వెబ్ 2.2130.7 కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త వ‌ర్ష‌న్ వెబ్‌/ డెస్క్‌టాప్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. డ్రాయింగ్ టూల్స్ అనే ఈ టూల్ సహాయంతో ఫొటోలను ఎడిట్ చేసుకోవచ్చట.

WhatsApp Web: డెస్క్‌టాప్, వాట్సప్ వెబ్‌లో ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు!!

Whatsapp Web Desktop Web (1)

WhatsApp Web: వాట్సప్‌లో మరో సరికొత్త ఆప్షన్ వచ్చింది. ఇంతకుముందెన్నడూ లేని ఫొటో ఎడిటింగ్ ఆప్షన్ ను మొబైల్ వెర్షన్ లో అందుబాటులోకి తెచ్చింది. వాట్స‌ప్ వెబ్ 2.2130.7 కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త వ‌ర్ష‌న్ వెబ్‌/ డెస్క్‌టాప్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. డ్రాయింగ్ టూల్స్ అనే ఈ టూల్ సహాయంతో ఫొటోలను ఎడిట్ చేసుకోవచ్చట.

దీని బీటా వ‌ర్ష‌న్‌ను మాత్ర‌మే విడుద‌ల చేయనున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉన్న ఈ ఫీచర్.. సెలెక్టెడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులోకి వ‌స్తుంది.

వాట్స‌ప్ ఇప్ప‌టికే వ్యూ వొన్స్, న్యూ ఆర్కైవ్ అనే ఫీచ‌ర్ల‌ను ఇటీవ‌లే వాడుకలోకి తెచ్చింది. వీటితో పాటుగా తాజాగా వాట్స‌ప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ యూజ‌ర్లు ఫోటోల‌ను ఎడిట్ చేసుకునే ఫీచ‌ర్ డ్రాయింగ్ టూల్స్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఎవ‌రికైనా ఫోటోను షేర్ చేసేట‌ప్పుడు.. దానిని ఎడిట్ చేసుకునేందుకు కొన్ని ఆప్ష‌న్ల‌ను చూపిస్తుంది.

ఎమోజీలు యాడ్ చేయ‌డం, స్టిక్క‌ర్స్‌, టెక్స్ట్ యాడ్ చేయ‌డం వంటి ప‌లు ఎడిట్ ఆప్ష‌న్ల‌తో డ్రాయింగ్ టూల్స్ ఫీచర్ వాడుకోవచ్చు. ఇప్ప‌టికే.. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజ‌ర్ల‌కు వాట్స‌ప్ ఫోటో ఎడిటింగ్ టూల్స్‌ను తీసుకొచ్చింది కానీ.. అది కూడా బీటా వ‌ర్ష‌న్‌లోనే రిలీజ్ అయింది.