Diabetes : షుగర్ వ్యాధి గ్రస్తులు తీపిపదార్ధాలు తింటే ప్రమాదమా?..

మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే.

Diabetes : షుగర్ వ్యాధి గ్రస్తులు తీపిపదార్ధాలు తింటే ప్రమాదమా?..

Sugar

Diabetes : ప్రపంచ వ్యాప్తంగా ఎక్కవ మందిని పట్టి పీడిస్తున్న వ్యాధి డయాబెటిస్…మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ గా వ్యవహరిస్తారు. ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మతగా దీనిని చెప్పవచ్చు. అతిమూత్రం, దాహం ఎక్కువగా వేయడం, చూపు మందగించటం, బరువు తగ్గడం, బద్ధకం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. ఒక్క‌సారి ఈ మ‌ధుమేహం వస్తే త‌గ్గ‌డం అంటూ ఉండ‌దు. చక్కెర వ్యాధి వచ్చిన వారు ఏదిపడితే అది తినకూడదు. తీసుకునే ఆహారానికి సంబంధించి కొన్ని పరిమితులు ఉంటాయి. లేదంటే శ‌రీరంలో విచ్చ‌ల‌విడిగా చ‌క్కెర‌స్థాయులు పెరిగిపోతాయి. దీనివ‌ల్ల పాదాల నుంచి మొద‌లుపెడితే మెద‌డు వ‌ర‌కు ప్ర‌తి అవ‌య‌వం దెబ్బ‌తింటుంది.

ప్రమాదకరమైన ఈ వ్యాధి బారిన భారత దేశంలో సుమారుగా 7 కోట్ల మంది ప‌డిన‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. మ‌రి ఇంత‌మందిని బాధిస్తున్న మ‌ధుమేహం ఎలా వ‌స్తుంది అన్నదానికిపై అనేక మందిలో చాలా సందేహాలు ఉన్నాయి. చ‌క్కెర వ్యాధి చ‌క్కెర ఎక్కువ‌గా తినటం వల్లనే వస్తుందని భావిస్తారు. అయితే మరికొంతమంది ఇతర కారణాల వల్ల వస్తాయంటారు. వంశ‌పారంప‌ర్యంగా డ‌యాబెటిస్ వ‌స్తుందని పరిశోధకలు చెబుతున్నారు. శ‌రీరంలో ఇన్సులిన్ స‌రైన మోతాదులో విడుద‌ల కాక‌పోవ‌డం మ‌ధుమేహానికి ప్ర‌ధాన కార‌ణం. సాధార‌ణంగా ఇన్సులిన్ శ‌రీరంలోని షుగ‌ర్ లెవ‌ల్స్‌ను నియంత్రిస్తుంది. కానీ ఎప్పుడైతే శ‌రీరానికి స‌రిప‌డ ఇన్సులిన్ ఉత్ప‌త్తి అవ్వ‌దో అప్పుడు శ‌రీరంలో చ‌క్కెరస్థాయుల్లో హెచ్చుత‌గ్గులు వ‌స్తాయి. అధిక బ‌రువు, ఊబ‌కాయంతో పాటు వంశ‌పారంప‌ర్యంగా కూడా మ‌ధుమేహం రావ‌డానికి చ‌క్కెర ఎక్కువ‌గా ఉన్న ఆహారాలు, ప్రాసెస్‌డ్ ఫుడ్ తీసుకోవ‌టమే కారణమని అంటారు. కానీ ఇవి నేరుగా డ‌యాబెటిస్‌కు కార‌ణం కావు. ఇవ‌న్నీ ఊబ‌కాయం ప్ర‌మాదాన్ని పెంచుతాయి. ఊబ‌కాయం మ‌ధుమేహానికి దారితీస్తుంది. ఇక తీపి ప‌దార్థాలు ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల మ‌ధుమేహం వ‌స్తుంద‌నేది ఏమాత్రం నిజం కాదు.

మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. మధుమేహంతో బాధపడేవారు చక్కెరను ఎప్పటికీ తినకూడదు అనేది అపోహ మాత్రమే. చక్కెర వ్యాధి గ్రస్తులు కేక్ లు వంటి వాటిని తినాలంటే దానికి కొంత ప్రణాళిక అవసరం. స్వీట్లు, కుకీలలో పిండి పదార్థాలు ఉంటున్నందున డయాబెటిక్ రోగులు.. వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారం స్థానంలో ఒక చిన్న కేక్ ముక్కను తీసుకోవచ్చు.డ‌యాబెటిస్ రోగుల్లో భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. వీరు తొంద‌ర‌గా కోపానికి, డిప్రెష‌న్‌కు లోన‌వుతుంటారు. ఆత్రుత‌గా క‌నిపిస్తుంటారు. ర‌క్తంలోని గ్లూకోజ్ లెవ‌ల్స్‌ను ప‌దే ప‌దే చెక్ చేయ‌డం కూడా ఒత్తిడికి గురి చేస్తాయి.

సాధార‌ణంగా గ‌ర్భధార‌ణ స‌మ‌యంలో కొంత‌మంది మ‌హిళ‌ల్లో ఇన్సులిన్ కావాల్సినంత ఉత్ప‌త్తి అవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల‌ చ‌క్కెర‌స్థాయులు విప‌రీతంగా పెరిగిపోతాయి. దీన్ని జ‌స్టినేష‌న‌ల్ డ‌యాబెటిస్ అని అంటారు. దాదాపు 9 శాతం మంది మ‌హిళ‌లు.. గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటారు. దీనివల్ల పుట్ట‌బోయే బిడ్డ‌కు కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంద‌ని కాదు. జెస్టేషనల్ డయాబెటిస్ సర్వసాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతుంది, కాక‌పోతే వైద్యుల‌ను సంప్ర‌దించి స‌రైన చికిత్స తీసుకుంటే స‌రిపోతుంది. దీనివ‌ల్ల పుట్ట‌బోయే బిడ్డ‌లో అధిక బ‌రువు, ఊబ‌కాయం, టైప్‌-2 డ‌యాబెటిస్‌, శ్వాస స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే ప్ర‌మాదం ఉంది.

వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, గంటల తరబడి కూర్చోని ఉండటం, పోషకపదార్థాలు సరిగా లేని ఆహారం, వేపుడు కూరలు, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు, మాంసాహారం, బేకరీ పదార్థాలు, నిల్వఉండే పచ్చళ్లు, తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల దుష్ఫరిణామాలు ఈ వ్యాధికి కారణం. స్టెరాయిడ్స్, కొన్ని రకాల వైరస్, ఇన్ఫెక్షన్స్, హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం వస్తుంటుంది. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తద్వారా శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. భోజనానికి అరగంట ముందు మాత్రలు వేసుకోవాలి. మాత్రలు వేసుకోవడం మాత్రమే కాదు. వాటిని ప్రతిరోజూ సరియైన సమయంలోనే వేసుకోవాలి. ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి. ఇన్సులిన్‌ వేసుకోవడంలోనూ కాల నియమాన్ని పాటించాలి.