T20 World Cup 2021 : చెలరేగిన బంగ్లా.. శ్రీలంక టార్గెట్ 172

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ అదరగొట్టింది. బంగ్లా బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత

T20 World Cup 2021 Sri Lanka Vs Bangladesh

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ అదరగొట్టింది. బంగ్లా బ్యాటర్లు చెలరేగారు.

నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ మహమ్మద్ నయీమ్(52 బంతుల్లో 62 పరుగులు), ముష్ఫికర్ రహీమ్ (37 బంతుల్లో 57 పరుగులు, నాటౌట్) హాఫ్ సెంచరీలో రాణించారు. లంక బౌలర్లలో కరుణరత్నే, ఫెర్నాండో, కుమార చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ గెలవాలంటే లంక జట్టు 172 పరుగులు చేయాలి.

Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య

షార్జా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ శనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సూపర్-12లో రెండు జట్లకీ ఇదే మొదటి మ్యాచ్‌ కాగా.. టీ20 వరల్డ్‌కప్‌లో ఈ రెండు జట్లు తలపడుతుండటం ఇది రెండోసారి మాత్రమే. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఢీకొట్టినప్పుడు.. శ్రీలంక 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు జట్లూ క్వాలిఫయింగ్ రౌండ్‌లో గెలిచి ఈ సూపర్-12కి అర్హత సాధించాయి.