IND vs PAK : భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌.. క‌ల‌వ‌ర‌పెడుతున్న పిచ్‌.. సై అంటున్న‌ వ‌రుణుడు.. విజ‌యం ఎవ‌రిదో ?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అస‌లు సిస‌లు స‌మ‌రానికి రంగం సిద్ధ‌మైంది.

India vs Pakistan

India vs Pakistan : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అస‌లు సిస‌లు స‌మ‌రానికి రంగం సిద్ధ‌మైంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఆదివారం కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. భార‌త కాలమానం ప్ర‌కారం రాత్రి 8.00 గంట‌ల‌కు న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ క్రికెట్ గ్రౌండ్ లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐర్లాండ్ పై విజ‌యం సాధించి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో శుభారంభం చేసిన టీమ్ఇండియా.. పాక్‌తోనూ గెలిచి సూప‌ర్‌-8 కు చేరువ కావాల‌ని చూస్తోంది.

అటు తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా అమెరికాతో చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ జ‌ట్టు భార‌త్ పై విజ‌యం సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌కు వ‌రుణుడు ముప్పూ పొంచి ఉంది. మ్యాచ్ ఆరంభ‌మైన అర‌గంట త‌రువాత 51 శాతం వ‌ర్షం ప‌డేందుకు అవ‌కాశం ఉంది. దీంతో 20 ఓవ‌ర్ల ఆట సాధ్య‌మేనా అన్న ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి.

WI vs UGA : 39 ప‌రుగుల‌కే ఉగాండా ఆలౌట్‌.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌రిత్ర‌లో వెస్టిండీస్‌కు అతి పెద్ద విజ‌యం..

క‌ల‌వ‌ర‌పెడుతున్న పిచ్‌..

ఇరు జ‌ట్ల బ‌లా బ‌లాల సంగ‌తి ఎలా ఉన్నా స‌రే.. ప్ర‌స్తుతం పిచ్ గురించే ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. నాసా కౌంటీ మైదానంలోని డ్రాప్ ఇన్ పిచ్‌ల వ‌ల్ల బ్యాట‌ర్ల‌కు గాయాలు అవుతున్నాయి. అస్థిర బౌన్స్, స్వింగ్ కార‌ణంగా బంతిని అంచ‌నా వేయ‌డంలో బ్యాట‌ర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే స‌మ‌యంలో గాయ‌ప‌డుతున్నారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చేతికి బంతి బ‌లంగా త‌గ‌ల‌డంతో రిటైర్డ్‌హ‌ర్ట్‌గా మైదానాన్ని వీడిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి పిచ్‌ల‌పై మ్యాచ్ లు నిర్వ‌హించ‌డం స‌రికాద‌ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

జ‌ట్టులోకి కుల్దీప్‌..

టీమ్ఇండియాలో ఓ మార్పు జ‌రిగే ఛాన్స్ ఉంది. స్పెష‌లిస్ట్ స్పిన్న‌ర్‌గా కుల్దీప్ యాద‌వ్ తుది జ‌ట్టులోకి రావొచ్చు. అత‌డు అక్ష‌ర్ ప‌టేల్ స్థానంలో బ‌రిలోకి దిగొచ్చు. పిచ్ ప‌రిస్థితుల దృష్ట్యా ఎక్స్‌ట్రా బ్యాట‌ర్ కావాల‌ని భావిస్తే మాత్రం సిరాజ్ పై వేటు వేసే అవ‌కావం ఉంది. ఒక‌వేళ స్పెష‌లిస్ట్ స్పిన్న‌ర్ వ‌ద్దంటే ఎలాంటి మార్పులు లేకుండా భార‌త్ బ‌రిలోకి దిగ‌నుంది. ఓపెన‌ర్లుగా కోహ్లి, రోహిత్ శ‌ర్మ రానుండ‌గా వ‌న్‌డౌన్ లో పంత్ ఆడ‌నున్నాడు. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాద‌వ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యాలు బరిలోకి దిగనున్నారు. గ‌త మ్యాచ్‌లో విఫ‌ల‌మైనా.. పాక్ అంటే చాలు కోహ్లి రెచ్చిపోయి ఆడ‌తాడు అన‌డంలో సందేహం లేదు.

IND vs PAK : పాక్‌తో మ్యాచ్‌.. టీమ్ఇండియాకు భారీ షాక్‌.. స్టార్ ఓపెన‌ర్‌కు గాయం..!

తుది జట్లు (అంచనా)..
టీమ్ఇండియా.. రోహిత్ శ‌ర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, రిష‌బ్ పంత్, సూర్యకుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, శివమ్‌ దూబె, ర‌వీంద్ర జడేజా, అక్షర్‌ప‌టేల్‌/కుల్దీప్ యాద‌వ్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్‌ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

పాకిస్థాన్‌.. మ‌హ్మ‌ద్ రిజ్వాన్, బాబర్ ఆజాం (కెప్టెన్‌), ఉస్మాన్, ఫకర్‌ జమాన్, షాదాబ్‌ ఖాన్, ఇఫ్తికర్‌ అహ్మద్, ఇమాద్‌ వసీం, షహీన్‌ షా అఫ్రిది, హారిస్‌ రవూఫ్, మహమ్మద్‌ అమీర్, నసీం షా.

 

ట్రెండింగ్ వార్తలు