T20 World Cup 2024 ticket sales open as ICC introduces public ballot
T20 World Cup 2024 ticket sales : టీ20 ప్రపంచకప్‌కు మరో ఐదు నెలలు సమయం ఉండానే అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుభవార్త చెప్పింది. ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. జూన్ 1 నుంచి 29 వరకు వెస్టిండీస్, యూఎస్‌లు సంయుక్తంగా టీ20 ప్రపంచకప్ 2024కి ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 55 మ్యాచులు తొమ్మిది నగరాల్లో జరగనున్నాయి.
ఈ క్రమంలో మ్యాచ్ టికెట్లకు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఐసీసీ పబ్లిక్ బ్యాలట్ విధానంలో టికెట్లను అమ్మకానికి ఉంచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులందరికి పారదర్శకంగా టికెట్లు లభించాలనే ఉద్దేశంతోనే ఇలా చేసింది. సాధారణంగా ఎవరు ముందుగా వస్తే వాళ్లకు టికెట్లు అన్న విధానంలో కాకుండా ఈ బ్యాలెట్ సిస్టమ్ ఏడు రోజుల పాటు తెరచే ఉంటుంది. ఆంటిగ్వా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 7 రాత్రి 11.59 గంటలకు విండో ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొ మ్యాచు కోసం ఆరు టికెట్లు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మ్యాచులకు పరిమితి లేదు. ఎన్ని మ్యాచులకు సంబంధించిన అయిన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
Rishabh Pant : ఎన్నోసార్లు గదిలోకి వెళ్లి ఏడ్చాను.. ఆసక్తికర విషయాలను పంచుకున్న రిషబ్ పంత్
టికెట్ల ధరలు 6 డాలర్ల నుంచి 25 డాలర్ల మధ్య ఉన్నాయి. భారత కరెన్సీలో చూసుకుంటే కనిష్ట ధర రూ.497 కాగా గరిష్ట ధర రూ.2070. కాగా.. ఈ విండో ద్వారా 6.60లక్షల టికెట్లను అమ్మకానికి ఉంచారు.
ఇక పబ్లిక్ బ్యాలట్ ద్వారా అమ్ముడుపోగా.. మిగిలిన టికెట్లను tickets.t20worldcup.com వైబ్‌సైట్‌లో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానున్నాయి. బ్యాలెట్ ద్వారా టికెట్లు పొందిన వాళ్లకు మెయిల్ ద్వారా టికెట్ల వివరాలను అందించనున్నారు. పేమెంట్‌కు సంబంధించి లింక్ ను కూడా పంపిస్తారు. నిర్దేశించిన సమయంలోగా పేమెంట్ చేయడంతో విఫలం అయితే టికెట్ క్యాన్సిల్ అవుతుంది.
T20 ప్రపంచ కప్ 2024లో భారత్ గ్రూప్ షెడ్యూల్ ఇదే..
జూన్ 5 – భారత్ వర్సెస్ ఐర్లాండ్ – న్యూయార్క్‌లో
జూన్ 9 – భారత్ వర్సెస్ పాకిస్థాన్ – న్యూయార్క్‌లో
జూన్ 12 – భారత్ వర్సెస్ యూఎస్ఏ – న్యూయార్క్‌లో
జూన్ 15 – భారత్ వర్సెస్ కెనడా – ఫ్లోరిడాలో