Rishabh Pant : ఎన్నోసార్లు గ‌దిలోకి వెళ్లి ఏడ్చాను.. ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్న రిష‌బ్ పంత్‌

టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు ఎంఎస్ ధోనితో త‌న‌ను పోల్చ‌డం న‌చ్చ‌ద‌ని వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ అన్నాడు.

Rishabh Pant : ఎన్నోసార్లు గ‌దిలోకి వెళ్లి ఏడ్చాను.. ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్న రిష‌బ్ పంత్‌

Rishabh Pant

Rishabh Pant – MS Dhoni : టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు ఎంఎస్ ధోనితో త‌న‌ను పోల్చ‌డం న‌చ్చ‌ద‌ని వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ అన్నాడు. త‌న కెరీర్ ఆరంభ రోజుల్లో ఒత్తిడిని త‌ట్టుకోలేక‌పోయాన‌ని చెప్పాడు. ఒక్కొసారి మ్యాచ్ జ‌రిగిన త‌రువాత రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేవాడిన‌న్నాడు. మ‌హీతో మంచి అనుబంధం ఉంద‌ని, ఎలాంటి విష‌యాల‌ను అయినా అత‌డితో చ‌ర్చిస్తాన‌ని తెలిపాడు.

కాగా.. రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన రిష‌బ్ పంత్ కోలుకున్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ క్ర‌మంలో స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పంత్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నాడు.

AUS vs WI 1st ODI : భ‌యం పోయింది! క‌రోనా వ‌చ్చినా క్రికెట్ ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయ‌ర్‌

పంత్ కెరీర్ ఆరంభంలో చాలా మంది అత‌డిని ఎంఎస్ ధోని వార‌సుడిగా ప్ర‌శంసించారు. అయితే.. అత‌డు విఫ‌లం అయిన సంద‌ర్భాల్లో దారుణంగా ట్రోలింగ్ చేసేవారు. దీనిపై పంత్ మాట్లాడుతూ ఇలాంటి పోలీక‌లు, విమ‌ర్శ‌లు త‌నను మాన‌సికంగా ఇబ్బందుల‌కు గురిచేసేవ‌న్నాడు. 5 మ్యాచులు ఆడిన ఆట‌గాడిని 500 మ్యాచులు ఆడిన దిగ్గ‌జ క్రికెట‌ర్‌తో పోల్చ‌డంలో అర్థం లేద‌న్నాడు.

అస‌లు ఇలా ఎందుకు చేస్తారో అర్ధం కాద‌న్నాడు. ఓ సారి మొహాలీలో జ‌రిగిన మ్యాచ్‌లో తాను స్టంప్‌ను మిస్ చేయ‌డంతో మైదానంలో ఉన్న ప్రేక్ష‌కులు ధోని ధోని అంటూ జ‌పించ‌డం మొద‌లు పెట్టారు. ఆ స‌మ‌యంలో త‌న మాన‌సిక ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్ప‌లేన‌న్నాడు. కొన్ని సార్లు రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేవాడిన‌ని అన్నాడు.

ధోనితో అనుబంధం గురించి..

బ‌య‌ట త‌న‌ను ధోనితో పోల్చిన‌ప్ప‌టికీ ఇది మ‌హేంద్రుడితో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని దెబ్బ‌తీయ‌లేద‌ని తెలిపాడు. త‌న‌కున్న‌ అత్యంత స‌న్నిహితుల్లో ధోని ఒక‌డ‌ని పంత్ తెలిపాడు. మ‌హీ ద‌గ్గ‌ర ఎలాంటి విష‌యానైనా తాను చ‌ర్చిస్తాన‌న్నాడు. ఓ సారి ధోనితో ఇలా చెప్పాను. ఐపీఎల్‌లో వికెట్ కీపింగ్ చేసిన‌ప్ప‌టికి కంటే అంత‌ర్జాతీయ మ్యాచుల్లో ఎక్కువ‌గా ఒత్తిడికి గురువుతున్నాడు అని అన్నాను. అప్పుడు ఆయ‌న మ‌రేం ప‌ర్లేదు.. అంత‌ర్జాతీయ మ్యాచ్ అన్న విష‌యం మ‌రిపోయి లీగ్ మ్యాచ్ ఆడిన‌ట్లే స్వేచ్ఛ‌గా ఆడ‌మ‌ని స‌ల‌హా ఇచ్చాడు. ధోని నుంచి ఎన్నో విష‌యాల‌ను నేర్చుకున్న‌ట్లు చెప్పాడు రిష‌బ్ పంత్‌.

IND vs ENG 2nd Test : యువ‌ స్పిన్న‌ర్ ట్రాప్‌లో ప‌డ్డ రోహిత్ శ‌ర్మ‌.. ఇంత‌కు మించిన ఆనందం ఇంకేముంటుంది?