AUS vs WI 1st ODI : భ‌యం పోయింది! క‌రోనా వ‌చ్చినా క్రికెట్ ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయ‌ర్‌

క‌రోనా వ‌చ్చిందంటే ఒక‌ప్పుడు భ‌య‌ప‌డి పోయే వారు.

AUS vs WI 1st ODI : భ‌యం పోయింది! క‌రోనా వ‌చ్చినా క్రికెట్ ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయ‌ర్‌

Josh Inglis playing the 1st AUS vs WI ODI despite testing positive for COVID

క‌రోనా వ‌చ్చిందంటే ఒక‌ప్పుడు భ‌య‌ప‌డి పోయే వారు. కానీ ఇప్పుడు అది ఓ మామూలు విష‌యంగా మారిపోయింది. రెండేళ్ల క్రితం క‌రోనా వ‌స్తే దాదాపు 15 రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉండాల్సి వ‌చ్చేది. క్రికెటర్లకు పాజిటివ్ వ‌స్తే మ్యాచ్‌ల‌కు దూరం అయ్యేవాళ్లు. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ కూడా క్రికెట‌ర్లు మ్యాచులు ఆడుతున్నారు. ముఖ్యంగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) త‌మ ప్లేయ‌ర్ల‌కు పాజిటివ్ వ‌చ్చినా ఆడిస్తోంది. తాజాగా జోష్ ఇంగ్లిస్ క‌రోనా బారిన ప‌డ్డాడు. అయిన‌ప్ప‌టికీ శుక్ర‌వారం వెస్టిండీస్‌తో మొద‌టి వ‌న్డేలో ఆడుతున్నాడు.

వెస్టిండీస్‌తో తొలి వ‌న్డేకు ముందు జోష్ ఇంగ్లిస్ క‌రోనా బారిన ప‌డిన‌ట్లు తెలిసింది. దీంతో అత‌డు తొలి వ‌న్డేకు దూరం అవుతాడ‌ని అంద‌రూ భావించారు. అయితే.. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రోటోకాల్‌ను అనుస‌రిస్తూ అత‌డు నేటి మ్యాచులో ఆడుతున్నాడు. అత‌డు జ‌ట్టు స‌భ్యుల‌కు దూరంగా ఉండ‌డంతో పాటు ప్ర‌త్యేక డ్రెస్సింగ్ రూమ్‌ను ఉప‌యోగిస్తున్నాడు. కాగా.. జోష్ ఇంగ్లిస్ మైదానంలో ఉన్న ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Mohammed Siraj : విశాఖ‌ టెస్ట్ స్క్వాడ్ నుంచి సిరాజ్‌ను త‌ప్పించిన బీసీసీఐ..

కాగా.. క‌రోనా పాజిటివ్‌గా వ‌చ్చిన‌ప్ప‌టికీ మ్యాచ్ ఆడుతున్న మూడో ఆస్ట్రేలియ‌న్ ప్లేయ‌ర్ జోష్ ఇంగ్లిస్ కావ‌డం గ‌మ‌నార్హం. 2023-24 బిగ్‌బాష్ లీగ్ సీజ‌న్‌లో ఆల్‌రౌండ‌ర్ హెన్రిక్స్ క‌రోనా బారిన ప‌డిన‌ప్ప‌టికీ బ్రిస్బేన్ హీట్ త‌రుపున ఆడాడు. ఇటీవ‌ల గ‌బ్బాలో వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో టెస్టులో కామెరూన్ గ్రీన్ సైతం ఇలాంటి ప‌రిస్థితుల్లోనే మ్యాచ్ ఆడాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 48.4 ఓవ‌ర్ల‌లో 231 ప‌రుగుల‌కు ఆలౌటైంది. వెస్టిండీస్ బ్యాట‌ర్ల‌లో కేసీ కార్తీ (88; 108 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స‌ర్లు), రోస్టన్ చేజ్ (59; 67 బంతుల్లో 7ఫోర్లు) హాఫ్ సెంచ‌రీలు బాదారు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో వెస్టిండీస్ ఓ మోస్తరు స్కోరుకే ప‌రిమిత‌మైంది. ఆసీస్ బౌల‌ర్ల‌లో జేవియర్ బార్ట్‌లెట్ నాలుగు వికెట్లు తీశాడు. సీన్ అబాట్, కామెరూన్ గ్రీన్‌లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఆడ‌మ్ జంపా ఓ వికెట్ సాధించాడు.

IND vs ENG 2nd Test : యువ‌ స్పిన్న‌ర్ ట్రాప్‌లో ప‌డ్డ రోహిత్ శ‌ర్మ‌.. ఇంత‌కు మించిన ఆనందం ఇంకేముంటుంది?