Mohammed Siraj : విశాఖ‌ టెస్ట్ స్క్వాడ్ నుంచి సిరాజ్‌ను త‌ప్పించిన బీసీసీఐ..

విశాఖ‌ టెస్ట్ స్క్వాడ్ నుంచి మ‌హ్మ‌ద్ సిరాజ్‌ను బీసీసీఐ త‌ప్పించింది.

Mohammed Siraj : విశాఖ‌ టెస్ట్ స్క్వాడ్ నుంచి సిరాజ్‌ను త‌ప్పించిన బీసీసీఐ..

Mohammed Siraj

Updated On : February 2, 2024 / 11:04 AM IST

Mohammed Siraj : విశాఖ వేదిక‌గా భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో హైద‌రాబాది కుర్రాడు, పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ఆడ‌డం లేదు. మొద‌టి టెస్టులో ఆడిన సిరాజ్ రెండో టెస్టులో ఎందుకు ఆడ‌డం లేద‌ని ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అయ్యాయి. ఇటీవ‌ల టీమ్ఇండియా ఆట‌గాళ్లు వ‌రుగా గాయాల‌పాలు అవుతుండ‌డంతో సిరాజ్ కూడా గాయ‌ప‌డ్డాడా అని అభిమానులు కంగారు ప‌డుతున్నారు. అయితే.. దీనిపై భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వివ‌ర‌ణ ఇచ్చింది.

గ‌త‌కొంత‌కాలంగా సిరాజ్ ఎక్కువ‌గా క్రికెట్ ఆడుతుండ‌డం, ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని అత‌డికి విశ్రాంతి ఇచ్చిన‌ట్లు బీసీసీఐ తెలిపింది. అందుక‌నే అత‌డిని రెండో టెస్టు స్వ్కాడ్ నుంచి తొల‌గించిన‌ట్లు పేర్కొంది. ఫిబ్ర‌వ‌రి 15న‌ రాజ్‌కోట్ వేదిక‌గా ప్రారంభం కానున్న మూడో టెస్టుకు అత‌డు అందుబాటులో ఉంటాడ‌ని చెప్పింది. అత‌డి స్థానంలో అవేశ్ ఖాన్‌ను జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

Sachin Tendulkar : అభిమాని ప్రేమకు సచిన్ టెండూల్కర్ ఫిదా..

ఇదిలా ఉంటే.. విశాఖ వేదిక‌గా జ‌రుగుతున్న‌ రెండో టెస్టు మ్యాచులో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేఎల్ రాహుల్‌, ర‌వీంద్ర జ‌డేజాలు గాయాల‌తో దూరం కావ‌డంతో తుది జ‌ట్టులో మూడు మార్పులు చేశారు. ర‌జ‌త్ పాటిదార్ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. కుల్దీప్ యాద‌వ్‌, ముఖేశ్ కుమార్‌లు తుది జ‌ట్టులోకి రాగా.. యువ ఆట‌గాడు స‌ర్ప‌రాజ్ ఖాన్ కు ఛాన్స్ ద‌క్క‌లేదు.

టీమ్ఇండియా తుది జ‌ట్టు : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రజత్‌ పటీదార్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎస్‌ భరత్ (వికెట్‌ కీపర్‌), ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, ముకేశ్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌

ఇంగ్లాండ్ తుది జట్టు : జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, పోప్‌, జో రూట్‌, బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్ (కెప్టెన్‌), బెన్‌ఫోక్స్ (వికెట్‌ కీపర్‌), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్