Sachin Tendulkar : అభిమాని ప్రేమకు సచిన్ టెండూల్కర్ ఫిదా..
క్రికెట్ దేవుడు, భారత దిగ్గజ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

Sachin Surprises Fan Wearing ‘Miss You Tendulkar’ MI Jersey On The Road
Sachin Surprises Fan : క్రికెట్ దేవుడు, భారత దిగ్గజ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అతడిని కలవాలని ఎంతో మంది కోరుకుంటారు. కాగా.. ఓ అభిమాని బైక్ పై వెలుతుండగా అతడిని చూసిన టెండూల్కర్ కారు ఆపి మరీ అతడితో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వెనుక వైపు టెండూల్కర్ అని పేరు రాసి ఉన్న నీలిరంగు ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించిన ఓ వ్యక్తి బైక్ పై వెలుతున్నాడు. కారులో వెలుతున్న సచిన్ అతడి చూశాడు. కారును పక్కకు ఆపాడు. సచిన్‌ను చూసిన సదరు వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఇంతలో సచిన్ ఎయిర్ పోర్టుకు ఎలా వెళ్లాలి అని అడిగాడు. దీంతో అతడు ‘నేను నమ్మలేకపోతున్నాను, థాంక్యూ గాడ్ ‘అంటూ చేతులు జోడించి నమస్మరించాడు. తనను తాను హరీష్‌కుమార్ అని పరిచయం చేసుకున్న అభిమాని సచిన్‌తో కరచాలనం చేశాడు. అనంతరం సచిన్ పై ఉన్న ప్రేమను వ్యక్త పరిచాడు.
IND vs ENG : టీమ్ఇండియాకు భారీ షాక్.. సిరీస్ నుంచి కీలక ఆటగాడు ఔట్! కోహ్లీ డౌట్!
ఓ సారి వెనక్కి తిరిగి తన స్నేహితుడికి టీషర్టు చూపించాలని సచిన్ కోరగా.. సదరు అభిమాని వెనక్కి తిరిగాడు. వెనక భాగంలో ‘సచిన్ టెండూల్కర్, 10, ఐ మిస్ యూ’ అని రాసి ఉంది. ఆ తరువాత దిగ్గజ ఆటగాడు సచిన్ అతడికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. హారీశ్ సెల్ఫీ కూడా తీసుకున్నాడు. కాగా..రోడ్డు పై హెల్మెట్‌ను ధరించి వాహనం నడపడం పట్ల సచిన్ అతడిని ప్రశంసించాడు.
ఈ వీడియోను స్వయంగా సచిన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘సచిన్‌ను టెండూల్కర్ కలిశాడు. నాపై కురిపించిన ప్రేమను చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఊహించని మూలల నుండి ప్రజల నుండి వచ్చే ప్రేమ.. జీవితాన్ని చాలా ప్రత్యేకంగా చేస్తుంది.’ అని సచిన్ రాసుకొచ్చాడు.
Ashwin : విశాఖ టెస్టు.. అశ్విన్‌ను ఊరిస్తున్న రికార్డులు ఏంటో తెలుసా..?