Ashwin : విశాఖ టెస్టు.. అశ్విన్‌ను ఊరిస్తున్న రికార్డులు ఏంటో తెలుసా..?

విశాఖ టెస్టుకు ముందు టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

Ashwin : విశాఖ టెస్టు.. అశ్విన్‌ను ఊరిస్తున్న రికార్డులు ఏంటో తెలుసా..?

Ravichandran Ashwin

Ashwin Records : విశాఖ టెస్టుకు ముందు టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న రెండో టెస్టు మ్యాచులో అశ్విన్ మ‌రో నాలుగు విక‌ట్లు తీస్తే.. టెస్టుల్లో 500 వికెట్ల క‌బ్‌లో అడుగుపెట్ట‌నున్నాడు. ఈ మైలురాయిని చేరుకున్న తొమ్మిదో ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్క‌నున్నాడు. ప్ర‌స్తుతం అశ్విన్ 96 టెస్టుల్లో 496 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్లు ప్ర‌ద‌ర్శ‌న 34 సార్లు న‌మోదు చేశాడు.

మ‌రిన్ని రికార్డులు..

రెండో టెస్టు మ్యాచులో రెండు వికెట్లు తీసినా చ‌రిత్ర సృష్టిస్తాడు. ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా రికార్డుల్లోకి ఎక్క‌నున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఘ‌న‌త చంద్ర‌శేఖ‌ర్ పేరిట ఉంది. చంద్ర‌శేఖ‌ర్ 38 ఇన్నింగ్స్‌ల్లో 95 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ త‌రువాత రెండో స్థానంలో అశ్విన్ ఉన్నాడు. అశ్విన్‌ 37 ఇన్నింగ్స్‌ల్లో 94 వికెట్లు సాధించాడు. వీరిద్ద‌రి త‌రువాత మూడో స్థానంలో అనిల్ కుంబ్లే 92 వికెట్ల‌తో ఉన్నాడు.

IND vs ENG 2nd Test : అదే వ్యూహాన్ని న‌మ్ముకున్న ఇంగ్లాండ్‌.. రెండో టెస్టుకు తుది జ‌ట్టు ప్ర‌క‌ట‌న.. భార‌త్‌కు క‌ష్టాలు త‌ప్ప‌వా..!

100 వికెట్లు..
ఇంగ్లాండ్ జ‌ట్టుపై ఇప్ప‌టి వ‌ర‌కు ఏ టీమ్ఇండియా బౌల‌ర్ కూడా వంద వికెట్లు తీయ‌లేదు. అశ్విన్ ఇప్ప‌టి వ‌ర‌కు ఇంగ్లాండ్ పై 94 వికెట్లు తీశాడు. అత‌డు మ‌రో 6 వికెట్లు గ‌నుక తీస్తే ఇంగ్లాండ్ పై వంద వికెట్లు తీసిన‌ మొద‌టి భార‌త బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించ‌నున్నాడు. ఇక రెండు జ‌ట్ల మ‌ధ్య అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా జేమ్స్ అండ‌ర్స్‌న్ ఉన్నాడు. 66 ఇన్నింగ్స్‌ల్లో 139 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

కుంబ్లే రికార్డు..
స్వ‌దేశంలో టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. కుంబ్లే స్వ‌దేశంలో 350 వికెట్లు తీశాడు. ప్ర‌స్తుతం అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. 56 టెస్టుల్లో 343 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ‌రో 8 వికెట్లు తీస్తే కుంబ్లే రికార్డులు బ‌ద్ద‌లు కొడ‌తాడు.

అశ్విన్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. అటు విశాఖ పిచ్ స్పిన్‌కు అనుకూలం అని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో రెండో టెస్టులోనే అశ్విన్ అన్ని రికార్డులు అందుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

రెండో టెస్టుకు భార‌త జ‌ట్టు ఇదే..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎస్‌ భరత్ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్ (వికెట్‌ కీపర్‌), ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, సర్ఫ‌రాజ్ ఖాన్‌, సౌర‌భ్ కుమార్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), మ‌హ్మ‌ద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌.

Shikhar Dhawan : యాంక‌ర్‌తో శిఖ‌ర్ ధావ‌న్‌.. మీరు న‌న్ను ఆక‌ర్షించారా..?