IND vs ENG 2nd Test : అదే వ్యూహాన్ని నమ్ముకున్న ఇంగ్లాండ్.. రెండో టెస్టుకు తుది జట్టు ప్రకటన.. భారత్‌కు కష్టాలు తప్పవా..!
ఇంగ్లాండ్ జట్టు అదే దూకుడును కొనసాగిస్తోంది.
IND vs ENG : ఇంగ్లాండ్ జట్టు అదే దూకుడును కొనసాగిస్తోంది. రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ఒక రోజు ముందే తమ తుది జట్టును ప్రకటించింది. ఉప్పల్‌లో విజయం సాధించిన ఫార్ములాతోనే విశాఖలోనూ బరిలోకి దిగనుంది. ఓ ఫాస్ట్ బౌలర్, ముగ్గురు స్పిన్నర్ల వ్యూహాన్నే మరోసారి ఇంగ్లాండ్ నమ్ముకుంది. గాయం కారణంగా సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ విశాఖ మ్యాచ్‌కు దూరం అయ్యాడు.
అతడి స్థానంలో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ అరంగ్రేటం చేయనున్నాడు. మొదటి టెస్టులో ఒక్క వికెట్ కూడా తీయని పేసర్ మార్క్‌వుడ్ ను జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు స్థానం కల్పించింది. ఈ రెండు మార్పులు మినహా ఉప్పల్‌లో ఆడిన జట్టుతోనే ఇంగ్లాండ్ విశాఖ మ్యాచులో ఆడనుంది.
రెండో టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే..
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్
Prashant Vaidya : చెక్ బౌన్స్ కేసులో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అరెస్ట్
We have named our XI for the second Test in Vizag! ?
?? #INDvENG ??????? | #EnglandCricket
— England Cricket (@englandcricket) February 1, 2024
విశాఖలో టీమ్ఇండియాకు అద్భుత రికార్డు..
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ స్టేడియం వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 2) నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. విశాఖ స్టేడియంలో భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన రెండు టెస్టుల్లోనూ టీమ్ఇండియా విజయం సాధించింది. ఈ క్రమంలో తమకు అచ్చొచ్చిన మైదానంలో మరో విజయాన్ని సాధించి ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను సమం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది.
ICC Test Rankings : దుమ్ములేపిన పోప్.. అశ్విన్, జడేజా టాప్.. కోహ్లీ, రోహిత్ ఎక్కడంటే..?