IND vs ENG 2nd Test : యువ స్పిన్నర్ ట్రాప్‌లో పడ్డ రోహిత్ శర్మ.. ఇంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది?
ఇంగ్లాండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Shoaib Bashir off to dream England start with Rohit Sharma's wicket on Test debut
IND vs ENG 2nd Test : ఇంగ్లాండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శుక్రవారం విశాఖ వేదికగా టీమ్ఇండియాతో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచు ద్వారా అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. అంతేనా.. విధ్వంసకర ఓపెనర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను అతడు ఔట్ చేశాడు. అరంగ్రేటం మ్యాచులోనే రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాడి వికెట్‌ను దక్కించుకోవడంతో బషీర్ ఎంతో సంతోషంగా ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌ను బరిలోకి దిగారు. వీరిద్దరు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. అయితే.. భారత ఇన్నింగ్స్ 18వ ఓవర్‌ను బషీర్ వేశాడు. ప్రణాళికల ప్రకారం లెగ్ స్లిప్‌లో ఫీల్డర్‌ను పెట్టీ మరీ రోహిత్‌కు బంతులు వేశాడు. మొదటి రెండు బంతులను డిఫెన్స్ ఆడిన రోహిత్.. మూడో బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి టర్న్ అయ్యింది. బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. లెగ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఒలీపోఫ్ చేతుల్లో పడింది.
Mohammed Siraj : విశాఖ టెస్ట్ స్క్వాడ్ నుంచి సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ..
రోహిత్ శర్మ 41 బంతులు ఎదుర్కొని 14 పరుగులే చేశాడు. దీంతో భారత్ 40 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. మొదటి రోజు ఆటలో లంచ్ విరామానికి భారత్ స్కోరు 103/2. యశస్విజైస్వాల్ (51), శ్రేయస్ అయ్యర్ (4) క్రీజులో ఉన్నారు.
కాగా.. వీసా సమస్యల కారణంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌కు బషీర్ దూరం అయిన సంగతి తెలిసిందే. అనంతరం భారత హైకమిషన్ చొరవతో బషీర్‌కు వీసా మంజూరు కావడంతో అతడు భారత్‌కు చేరుకున్నాడు. మొదటి టెస్టు మ్యాచులో స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయడడంతో విశాఖ టెస్టులో బషీర్‌కు అవకాశం దక్కింది.
Selfless captain Rohit Sharma ?#IndvsEng #INDvsENGTest pic.twitter.com/s5oRj4vyL1
— Shivam ? (@Shivam_pal_18) February 2, 2024