T20 World Cup 2026 IND vs ENG Hardik Pandya is all set to surpass KL Rahul in an elite list
Hardik Pandya : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖడే వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకోవాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. ఇరు జట్లు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో తలపడడం వరుసగా ఇది మూడోసారి కావడం విశేషం. కాగా.. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది.
ఈ మ్యాచ్‌లో పాండ్యా 23 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డులకు ఎక్కనున్నాడు. ఈ క్రమంలో అతడు కేఎల్ రాహుల్ ను అధిగమిస్తాడు. 72 మ్యాచ్‌ల్లో 37.75 సగటుతో 2265 పరుగులను కేఎల్ రాహుల్ సాధించాడు.
ఇక పాండ్యా విషయానికి వస్తే.. 2016లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన అతడు ఇప్పటి వరకు 136 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 107 ఇన్నింగ్స్‌ల్లో 28.39 సగటుతో 2243 పరుగులు సాధించాడు. ఇక భారత్ తరుపున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది.
హిట్‌మ్యాన్ 159 మ్యాచ్‌ల్లో 32.05 సగటుతో 4231 పరుగులు సాధించాడు. ఆ తరువాత కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు వీరే..
* రోహిత్ శర్మ – 159 మ్యాచ్‌ల్లో 4231 పరుగులు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 4188 పరుగులు
* సూర్యకుమార్ యాదవ్ – 111 మ్యాచ్‌ల్లో 3261 పరుగులు
* కేఎల్ రాహుల్ – 72 మ్యాచ్‌ల్లో 2265 పరుగులు
* హార్దిక్ పాండ్యా – 136 మ్యాచ్‌ల్లో 2243 పరుగులు