T20 World Cup 2026 key match between England vs New Zealand
ENG vs NZ : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 గ్రూప్-2లో భాగంగా శుక్రవారం కొలంబో వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి ఈ మ్యాచ్ పై ఉంది. ఈ మ్యాచ్ ఫలితం పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను నేరుగా ప్రభావం చేయనుంది. ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్ బెర్తును ఖాయం చేసుకోగా, న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌లో అడుగుపెట్టనుంది. అప్పుడు పాకిస్థాన్ ఇంటి ముఖం పడుతుంది.
ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఇంగ్లాండ్ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడు పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. ఒక్క పాయింట్‌తో పాకిస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతుండగా, ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన శ్రీలంక జట్టు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఇంగ్లాండ్ ఓ సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవడంతో మరో బెర్తు కోసం పాక్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ ఉంది. ఇంగ్లాండ్ పై విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా కివీస్ సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోయిన కూడా ఆ జట్టుకు అవకాశం ఉంటుంది.
శ్రీలంక పై పాక్ గెలిస్తే అప్పుడు పాక్, న్యూజిలాండ్ జట్ల పాయింట్లు సమానంగా ఉంటాయి. మెరుగైన రన్‌రేటు కలిగిన జట్టు సెమీస్‌లో అడుగుపెడుతోంది. ప్రస్తుతం కివీస్ నెట్‌రన్‌రేటు (+3.050) పాక్ నెట్‌రన్ కంటే (-0.461) ఎంతో మెరుగ్గా ఉంది. ఒకవేళ శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిపోతే అప్పుడు కూడా న్యూజిలాండ్ సెమీస్‌లో అడుగుపెడుతుంది.
ఒక వేళ వర్షం కారణంగా న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ రద్దు అయితే అప్పుడు ఇరు జట్లకు చెరొక పాయింట్‌ను కేటాయిస్తారు. అప్పుడు న్యూజిలాండ్ సెమీస్‌లో అడుగుపెడుతుంది. పాక్ ఇంటికి వెలుతుంది.