×
Ad

IND vs PAK : నా అల్లుడిని జ‌ట్టులోంచి తీసేయండి.. అప్పుడే పాక్ గెలుస్తుంది.. షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

త‌న అల్లుడితో పాటు మ‌రో ఇద్ద‌రు ప్లేయ‌ర్లును పాక్ జ‌ట్టులోంచి (IND vs PAK) తొల‌గించాల‌ని మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది డిమాండ్ చేశాడు.

T20 World Cup 2026 Shahid Afridi wants three players dropped after loss to India

IND vs PAK : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా కొలంబో వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ చేతిలో పాకిస్థాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 61 ప‌రుగుల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో భార‌త్ పై పాక్‌కు ఇది ఎనిమిదో ఓట‌మి. భార‌త్ చేతిలో ఓడిపోవ‌డంతో పాక్ జ‌ట్టుపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది.

సొంత అభిమానుల‌తో పాటు ఆ జ‌ట్టు మాజీ ఆట‌గాళ్లు కూడా పాక్ ప్లేయ‌ర్ల‌పై మండిప‌డుతున్నారు. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఓ అడుగుముందుకు వేసి జ‌ట్టులోంచి త‌న సొంత అల్లుడితో పాటు మ‌రో ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశాడు. పాకిస్థాన్ సూప‌ర్‌-8కి చేరుకోవాలంటే న‌మీబియాతో మ్యాచ్‌లో ఆ ముగ్గురిని తొల‌గించి యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరాడు.

IND vs PAK : ‘నా గేమ్ ప్లాన్ ఇదే.. పిచ్‌తో నాకు సంబంధం లేదు.. బాల్ ప‌డిందా..’ ఇషాన్ కిష‌న్ కామెంట్స్ వైర‌ల్..

‘సీనియ‌ర్ ఆట‌గాళ్లు నాణ్య‌మైన జ‌ట్ల‌పై రాణించ‌క‌పోవ‌డాన్ని గ‌త కొంత‌కాలంగా చూస్తూనే ఉన్నాం. యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. నేను సెల‌క్ట‌ర్‌ను అయితే బాబర్ ఆజామ్‌, షాహీన్ అఫ్రిది, షాదాబ్‌లను తొల‌గిస్తాను. ప్ర‌పంచ‌క‌ప్‌లో పాక్ సూప‌ర్‌-8కి అర్హ‌త సాధించాలంటే క‌నీసం న‌మీబియాతో మ్యాచ్‌లోనైనా కొత్త వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాలి.’ అని అఫ్రిది అన్నాడు.

మ‌రో మాజీ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ యూసుఫ్ కూడా దాదాపుగా ఇలాగే మాట్లాడాడు. షాహీన్, బాబ‌ర్, షాబాద్‌లు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాల‌న్నాడు. బ‌ల‌హీన జ‌ట్ల‌పై రాణించ‌డం కాద‌ని, బ‌ల‌మైన జ‌ట్ల‌పై రాణించాల‌న్నాడు. ప్ర‌స్తుతం పాక్ టీ20 జ‌ట్టులో యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని కోరాడు.

IND vs PAK : పాక్ పై గెలిచిన త‌రువాత.. కుల్దీప్ యాద‌వ్ పై హార్దిక్ పాండ్యా, సూర్య‌కుమార్ యాద‌వ్ గ‌రం గ‌రం..

భార‌త్‌తో మ్యాచ్‌లో షాహీన్, బాబ‌ర్, షాబాద్‌లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. బాబ‌ర్ 5 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. షాహీన్ అఫ్రిది రెండు ఓవ‌ర్లు వేసి 31 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. అక్ష‌ర్ ప‌టేల్ వికెట్ మాత్ర‌మే తీశాడు. అది కూడా ఇన్నింగ్స్ ఆఖ‌రి బంతికి కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. బ్యాటింగ్‌లో షాహీన్ 19 బంతుల్లో 23 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఇక షాబాద్ విష‌యానికి వ‌స్తే.. అత‌డు ఒకే ఒక ఓవ‌ర్ వేసి 17 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ల‌క్ష్య ఛేద‌న‌లో అత‌డు 15 బంతుల్లో 14 ప‌రుగులు చేశాడు.