×
Ad

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. స్టార్ ఆట‌గాళ్ల పై వేటు.. బ‌ల‌మైన జ‌ట్టు అంటూ..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 కోసం (T20 World Cup 2026) ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌కటించింది.

T20 World Cup 2026 South Africa announce squad Kagiso Rabada returns

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కు సౌతాఫ్రికా జ‌ట్టు ఇదే
  • ఐడెన్ మార్‌క్ర‌మ్ సార‌థ్యంలో బ‌రిలోకి
  • ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్ ల వేటు

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 కోసం ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌కటించింది. ఐడెన్ మార్‌క్ర‌మ్ సార‌థ్యంలోనే ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ఈ మెగాటోర్నీలో బ‌రిలోకి దిగ‌నుంది. 15 మంది సభ్యులు గ‌ల బృందంలో స్టార్ ఆట‌గాళ్లు ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్ ల‌కు చోటు ద‌క్క‌లేదు. పక్కటెముక గాయం కారణంగా భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన పేస‌ర్ కగిసో రబాడ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు.

ఐడెన్ మార్‌క్ర‌మ్ సార‌థ్యంలో దక్షిణాఫ్రికా జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌2026 లో బ‌రిలోకి దిగ‌నుంది. కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జీ, డోనోవన్ ఫెర్రీరా, జార్జ్ లిండే, క్వెనా మఫాకా, జాసన్ స్మిత్.. వీరంద‌రికి ఇదే తొలి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

BAN vs IND : బంగ్లాదేశ్‌లో టీమ్ఇండియా ప‌ర్య‌ట‌న ఖ‌రారు.. గ‌త ఏడాది వాయిదా ప‌డిన సిరీస్‌ల‌ రీ షెడ్యూల్ డేట్స్ ఇవే..

సెలక్షన్ కన్వీనర్ పాట్రిక్ మోరోనీ జ‌ట్టు ఎంపిక పై మాట్లాడాడు. ‘మేము కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. కానీ ఈ బృందం అత్యంత బలమైనదని, భారతదేశం, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఈ బృందం విజ‌యం సాధిస్తుంద‌ని మేము భావిస్తున్నాం.’ అని తెలిపాడు.

అఫ్గానిస్తాన్, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు ద‌క్షిణాఫ్రికా ఒకే గ్రూపులో ఉంది. భార‌త్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ఫిబ్ర‌వ‌రి 7 ప్రారంభం కానుంది. మార్చి 8న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇక ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్‌ను ఫిబ్ర‌వ‌రి 9న ఆడ‌నుంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో కెన‌డాతో త‌ల‌ప‌డ‌నుంది.

BBL : వీడెవండీ బాబు.. వెనక్కి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో గ్రేటెస్ట్ క్యాచ్ అందుకున్నాడు.. క‌ట్ చేస్తే మామూలు ట్విస్ట్ కాదురా అయ్యా..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 కోసం ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ఇదే..
ఐడెన్ మార్‌క్ర‌మ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డికాక్ , టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్ , క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబాడ‌, జేస‌న్ స్మిత్