×
Ad

T20 World Cup 2026 : టీ20ప్ర‌పంచ‌క‌ప్ కోసం జింబాబ్వే జ‌ట్టు ఇదే.. ఇదేం ట్విస్ట్ సామీ.. 39 ఏళ్ల ఆట‌గాడికి చోటు..

టీ20ప్ర‌పంచ‌క‌ప్‌2026 కోసం (T20 World Cup 2026 ) జింబాబ్వే క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది.

T20 World Cup 2026 Zimbabwe announce squad Sikandar Raza will lead

  • టీ20ప్ర‌పంచ‌క‌ప్ 2026 కోసం జింబాబ్వే జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌
  • సికంద‌ర్ ర‌జా సార‌థ్యంలో
  • 39 ఏళ్ల మాజీ కెప్టెన్ గ్రేమ్ క్రీమర్‌కు చోటు

T20 World Cup 2026 : టీ20ప్ర‌పంచ‌క‌ప్‌2026 కోసం జింబాబ్వే క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. సికంద‌ర్ ర‌జా సార‌థ్యంలోనే జింబాబ్వే ఈ మెగాటోర్నీ బ‌రిలోకి దిగ‌నుంది. 15 మంది స‌భ్యులు గ‌ల బృందంలో 39 ఏళ్ల మాజీ కెప్టెన్ గ్రేమ్ క్రీమర్ చోటు ద‌క్కించుకున్నాడు. అదే స‌మ‌యంలో 22 ఏళ్ల యువ ఆట‌గాడు బ్రియాన్ బెన్నెట్ కు అవ‌కాశం ఇచ్చారు.

బ్రియాన్ బెన్నెట్ ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. గ‌త ఐదు టీ20 మ్యాచ్‌ల్లో అత‌డు ఒకేసారి మాత్రమే సింగిల్ డిజిట్‌కు ఔట్ అయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో వ‌రుస‌గా 49, 49, 47 ప‌రుగులు చేసి హాఫ్ సెంచ‌రీల‌ను తృటిలో కోల్పోయాడు.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. స్టార్ ఆట‌గాళ్ల పై వేటు.. బ‌ల‌మైన జ‌ట్టు అంటూ..

భార‌త్, శ్రీలంక దేశాలు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌2026కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నీ ఫిబ్ర‌వ‌రి 7 నుంచి మార్చి 8 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంకతో క‌లిసి జింబాబ్వే గ్రూప్ బిలో ఉంది. ఈ టోర్నీలో జింబాబ్వే త‌మ తొలి మ్యాచ్‌ను ఫిబ్ర‌వ‌రి 9న ఆడ‌నుంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఒమ‌న్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

ఆ తర్వాత ఫిబ్రవరి 13న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆస్ట్రేలియాను ఢీ కొట్ట‌నుంది. ఫిబ్రవరి 17న పల్లెకెలెలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌తో తలపడుతుంది. కొలంబోలో శ్రీలంకతో జరిగే ఆటతో లీగ్ ద‌శ‌ను ముగిస్తుంది.

BAN vs IND : బంగ్లాదేశ్‌లో టీమ్ఇండియా ప‌ర్య‌ట‌న ఖ‌రారు.. గ‌త ఏడాది వాయిదా ప‌డిన సిరీస్‌ల‌ రీ షెడ్యూల్ డేట్స్ ఇవే..

టీ20ప్ర‌పంచ‌క‌ప్ 2026 కోసం జింబాబ్వే జట్టు ఇదే..

సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమెర్, బ్రాడ్ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియోన్ మైయర్స్, రిచర్డ్ నగరవ, బ్రెండన్ టేలర్‌