T20 World Cup: ఇండియాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై బీసీసీఐకి డెడ్‌లైన్ విధించిన ఐసీసీ

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నెల రోజుల గడువు అడిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం మీటింగ్ ఏర్పాటు చేసి బీసీసీఐకి జూన్ 28లోగా...

T20 World Cup: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నెల రోజుల గడువు అడిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం మీటింగ్ ఏర్పాటు చేసి బీసీసీఐకి జూన్ 28లోగా తెలియజేయాలని గడువు విధించింది.

కొవిడ్-19 మహమ్మారి ప్రభావం ఉన్న కారణంగా మే29న ఆఫీస్ బేరర్లను సమయాన్ని పొడిగించాలని కోరింది బీసీసీఐ. ఈ ఏడాది ఇండియాలోనే టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అంతా సవ్యంగా జరిగితే అక్టోబర్-నవంబర్ మధ్య కాలంలో టోర్నమెంట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు.

అంతకంటే ముందు గతేడాది జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ 2021కి వాయిదా వేశారు. కొవిడ్ కేసులు పెరగడంతో ఐపీఎల్ 2021 సీజన్ కూడా రద్దు చేసింది బీసీసీఐ. ఇటీవల జరిగిన చర్చల రీత్యా యూఏఈలో బయో బబుల్స్ లో టోర్నమెంట్ కొనసాగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక టీ20 వరల్డ్ కప్ కూడా హోస్టింగ్ చేయలేమని చేతులెత్తేస్తే యూఏఈలో నిర్వహించాల్సిందే. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, అహ్మదాబాద్, బెంగళూరు, ధర్మశాల, హైదరాబాద్, లక్నో ఇలా 9 వేదికలలో టోర్నమెంట్ నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు